vivo T2 5G: 64MP OIS కెమేరాతో బడ్జెట్ ధరలో వచ్చింది..ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా !
ఈరోజు వివో మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది
vivo T2 5G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో 64MP OIS కెమేరాతో వచ్చింది
ఈ ఫోన్ వివో టి1 5g ఫోన్ యొక్క తరువాతి తరం ఫోన్ గా లాంచ్ చెయ్యబడింది
ఇండియాలో ఈరోజు వివో మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. అదే, vivo T2 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 64MP OIS కెమేరాతో వచ్చింది. ఈ ఫోన్ ప్రీమియం లుక్ మరియు ఫీచర్లతో ఉన్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ వివో టి1 5g ఫోన్ యొక్క తరువాతి తరం ఫోన్ గా లాంచ్ చెయ్యబడింది. మరి ఈరోజే ఇండియన్ మార్కెట్ లో విడుదలైన ఈ వివో 5G స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దాం పదండి.
Surveyvivo T2 5G: ధర మరియు ఆఫర్లు
వివో ఇటీవల vivo T2 5G బేసిక్ వేరియంట్ రూ.18,990 ప్రారంభ ధరతో లాంచ్ చెయ్యబడింది మరియు ఇది 6GB మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. మరొక వేరియంట్ 8GB మరియు 128GB స్టోరేజ్ ధర రూ.20,990. ఈ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా జతచేసింది. ఈ ఫోన్ ను ICICI,SBI మరియు HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు వివో ఆన్లైన్ స్టోర్స్ నుండి మొదలువుతుంది
vivo T2 5G: స్పెక్స్
Vivo T2 5G స్మార్ట్ ఫోన్ 6.38 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగివుంది. ఇది 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటుగా 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం చిన్న వాటర్ డ్రాప్ నోచ్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
కెమెరాల పరంగా, ఈ వివో T2 5జి ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరాకి జతగా 2MP కెమెరా కలిగిన డ్యూయల్ కెమేరా సెటప్ తో వస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారితమైన Funtouch OS 13 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
