ఇండియాలో తన VIVO S1 స్మార్ట్ ఫోన్ యొక్క ధరలో భారీతగ్గింపు అందుకుంది. ఈ స్మార్ట్ ఫోన్, గత ఏడాది ఆగస్టులో నెలలో 4 GB ర్యామ్ వేరియంట్ రూ .17,990 ధర వద్ద విడుదల చేశారు. అయితే, ఈ ఫోన్ పైన ఇప్పుడు 1000 రూపాయల ధర తగ్గింపు ప్రకటించడంతో, ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ప్రస్తుతం కేవలం, 16,990 రూపాయల ధరకు అమ్ముడవుతోంది. ఈ ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్‌ను కూడా రూ .19,990 వద్ద ప్రవేశపెట్టారు, కాని సంస్థ ఇప్పుడు దీనిని నిలిపివేసింది.
వివో ఎస్ 1 ఆఫ్‌లైన్ మార్కెట్, అంటే మొబైల్ స్టోర్స్ ను లక్ష్యంగా చేసుకుని అమ్మకాలను సాగిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాల్లో లభిస్తుంది. అలాగే, 1 మే నుండి కొత్త ధర అమల్లోకి వచ్చిందని మరియు లాక్ డౌన్ ముగిసిన తరువాత రిటైల్ దుకాణాలు పనిచేయడం ప్రారంభించిన తర్వాత వినియోగదారులు ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని 91 మొబైల్స్ తన రిటైల్ సోర్స్ ద్వారా తెలుసుకుంది.
ఈ వివో ఎస్ 1 మొబైల్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ వివో ఎస్ 1 ఫోన్ ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఇది ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ లో, మీడియా టెక్ ఇటీవలే ప్రవేశపెట్టిన మీడియాటెక్ హెలియో పి 65 ప్రాసెసర్ ని అందించింది, ఈ ప్రాసెసర్‌తో లాంచ్ చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోన్. అదనంగా, ఇది 4GB/6GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.
ఇది కాకుండా మీరు ఫోటోగ్రఫీ కోసం వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందుతారు. ఒక 16MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరాను మరియు ఒక 2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్లో 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్‌లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్కై లైన్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.