vivo launching Vivo T4 Ultra with 100x tele lens in india
Vivo T4 Ultra స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ని వివో అనౌన్స్ చేసింది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Sony కెమెరా మరియు మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ మరియు ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తున్నాయి.
వివో టి4 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను జూన్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయడానికి వివో డేట్ మరియు టైమ్ సెట్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత Flipkart నుంచి సేల్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే, వివో ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ను సేల్ ఆన్లైన్ లైన్ సేల్ పార్ట్నర్ ఎంచుకుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది.
Also Read: cmf buds పై ఈరోజు గొప్ప డీల్స్ ఆఫర్ చేసిన Flipkart: రూ. 1899 నుంచి ప్రైస్ స్టార్ట్
వివో టి4 అల్ట్రా స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలకమైన ఫీచర్స్ వివో అందించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్ తో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో వెనుక సరికొత్త కెమెరా డిజైన్ అందించింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9300+ తో లాంచ్ చేస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఇది 20 లక్షల కంటే ఎక్కువ AnTuTu అందించే చిప్ సెట్ మరియు AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ వివరాలు కూడా వివో అందించింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP Sony IMX921 (OIS) ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 50MP Sony IMX882 (3x పెరిస్కోప్) కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 10X టెలిఫోటో మ్యాక్రో జూమ్ కలిగిన ఫోన్ అవుతుంది మరియు ఏకంగా 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.