Vivo T4 Pro ఫోన్ ను సూపర్ జూమ్ కెమెరాతో లాంచ్ చేస్తున్న వివో.!

Updated on 15-Aug-2025
HIGHLIGHTS

Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం వివో అన్ని ఏర్పాట్లు చేస్తోంది

ఇప్పుడు ఈ సిరీస్ నుంచి టి4 ప్రో లాంచ్ కోసం సిద్దమయ్యింది

ఫ్లాగ్ షిప్ లెవెల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని వివో టీజింగ్ మొదలు పెట్టింది

Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం వివో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత నెల చివరిలో ఇదే సిరీస్ నుంచి వివో టి4 ఆర్ ఫోన్ విడుదల చేసిన వివో, ఇప్పుడు ఈ సిరీస్ నుంచి టి4 ప్రో లాంచ్ కోసం సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ లెవెల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని వివో టీజింగ్ మొదలు పెట్టింది.

Vivo T4 Pro ఎప్పుడు లాంచ్ అవుతుంది?

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి4 ప్రో లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని వివో ప్రకటించింది. ఈ ఫోన్ కోసం ‘కమింగ్ సూన్’ ట్యాగ్ తో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Vivo T4 Pro టీజింగ్ ఫీచర్స్ ఏమిటీ?

వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ మరియు వీడియో ద్వారా ఈ ఫోన్ యొక్క కెమెరా వివరాలు చూపించింది. ముఖ్యంగా, వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ ను సూపర్ జూమ్ సపోర్ట్ కలిగిన ఫ్లాగ్ షిప్ లెవెల్ 3x పెరిస్కోప్ కెమెరాతో లంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా ఉంటుంది మరియు ఇందులో ఈ పెరిస్కోప్ కెమెరా ఒకటిగా ఉంటుంది.

ప్రస్తుతానికి, పైన కెమెరా వివరాలు మాత్రమే తెలిపి, ఈ ఫోన్ యొక్క మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తుందని ఈ టీజర్ పేజీలో తెలిపింది. కానీ ఈ ఫోన్ కెమెరా టీజింగ్ కోసం అందించిన ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుందని అర్థం అవుతుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ కూడా AI సపోర్ట్ తో వస్తుంది. అంటే, AI కెమెరా ఫీచర్స్ , AI అసిస్టెంట్ మరియు మరిన్ని ఎఐ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ఆరా రింగ్ లైట్ కూడా కెమెరా సెటప్ తో జతగా ఉంటుంది.

Also Read: AI సహాయంతో Independence Day 2025 ఇమేజెస్ మరియు విషెస్ సింపుల్ గా క్రియేట్ చేయండి.!

ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్, పవర్ ఫుల్ అండ్ బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లాంచ్ అయిన ఫోన్స్ ఫీచర్స్ పరిశీలించి ఈ అంచనా ఫీచర్స్ చెబుతున్నారు. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్లు కూడా వివో త్వరలో అందిస్తుంది. అప్పుడు కొత్త అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాము.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :