వివో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Vivo Y20T ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను మంచి గేమింగ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో ప్రకటించింది. ఈ ఫోన్ ను 1GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ తో తీసుకురావడం మంచి విషయంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే, అవసరాన్ని బట్టి 1GB వరకూ ఈ ఫోన్ లో ర్యామ్ ను పెంచుకోవచ్చు. మరి ఈఆ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందామా..!
Vivo Y20T స్మార్ట్ ఫోన్ కేవలం 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ తో మాత్రమే లభిస్తుంది మరియు దీని ధర రూ.15, 490 రూపాయలు. ఈ స్మార్ట్ ఫోన్ వివో సొంత వివో ఇండియా E- స్టోర్ మరియు ఆన్లైన్ ప్లాట్ఫారం Amazon మరియు Flipkart తో పాటుగా Paytm, Tata Cliq నుండి లభిస్తుంది.
వివో వై 20టి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.51 అంగుళాల HD హలో ఫుల్ వ్యూ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అధనంగా, 1GB వరకూ ర్యామ్ ను పెంచుకునే వీలుంది. ఈ ఫోన్ మల్టి 3.0 తో వేగంగా పనిచేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, వివో వై 20టి వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 13MP మైన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో మరియు 2MP బొకే కెమెరా వున్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ ఫన్ టచ్ OS 11.1 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ ను పెద్ద 5000 mAh బ్యాటరీతో మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో అందించింది.