vivo launched Vivo Y21 5G and Vivo Y11 5G in Indian market
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో ఈ రోజు ఇండియన్ మార్కెట్లో Vivo Y21 5G మరియు Vivo Y11 5G రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కూడా బడ్జెట్ ధరలో బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ తో విడుదల చేసింది. ఈరోజే వివో సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
ముందుగా వివో వై 11 ప్రైస్ చూస్తే, ఈ ఫోన్ బేసిక్ (4 జీబీ + 64 జీబీ) వేరియంట్ ను రూ. 14,999 ధరతో మరియు హై ఎండ్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 16,999 ధరతో లాంచ్ చేసింది.
ఇక వివో వై 21 5జి ప్రైస్ చూస్తే, ఈ ఫోన్ (4 జీబీ + 128 జీబీ) బేసిక్ వేరియంట్ ను రూ. 18,999 ధరతో, (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 20,999 ధరతో మరియు హై ఎండ్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది.
అయితే, పైన తెలిపిన ఈ ఫోన్ ధరలు ఆఫర్స్ తో కలిపి అందించిన ధరలు అని గమనించాలి. వివో వై 21 5జి ఫోన్ పై రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు వివో వై 11 5జి ఫోన్ పై రూ. 1,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్లు వివో ఇ స్టోర్, Flipkart మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ ద్వారా ఈ సేల్ చేస్తుంది.
Also Read: Samsung 43 ఇంచ్ 4K Smart Tv అమెజాన్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
వివో ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఒకే విధమైన డిజైన్ మరియు దాదాపు ఓకే విధమైన ఫీచర్స్ తో కూడా అందించింది. కెమెరా మరియు ఛార్జ్ సపోర్ట్ విషయం లో మాత్రమే ఈ రెండు ఫోన్లు వ్యత్యాసం కలిగి ఉంటాయి. వివో y21 మరియు వై లెవెన్ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 6.74 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి.
వివో ఈ రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను కూడా మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో అందించింది. వివో 21 స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ వరకు గరిష్ట ర్యామ్ మరియు వివో 11 స్మార్ట్ ఫోన్ లో 6 జీబీ వరకు గరిష్ట ర్యామ్ అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా గరిష్టంగా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి.
ఇక కెమెరా సెట్ అప్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. అయితే, వై 21 లో 50MP మెయిన్ కెమెరా ఉంటే వై 11 ఫోన్ లో మాత్రం 13MP మెయిన్ కెమెరా మాత్రమే ఉంటుంది. కానీ ఈ రెండు ఫోన్లు కూడా 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు AI కెమెరా ఫిల్టర్లు మరియు ఫీచర్లు కలిగి ఉంటాయి.
ఇక ఈ రెండు ఫోన్లు కలిగిన బ్యాటరీ సెటప్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా 6,500 బ్యాటరీ ఉంటాయి. అయితే, వై 11 ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటే వివో వై 21 ఫోన్ మాత్రం 44W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.