Vivo V70 Elite and vivo V70 launched in India Check price camera battery specs
వివో ఈరోజు వి70ఎం సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి అందించిన ViVO V70 Elite ను ప్రీమియం ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ 50MP ZEISS కెమెరా సెటప్ మరియు మంచి కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ ప్రోసెసర్ అండ్ బిగ్ బ్యాటరీతో కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
వివో వి 70 ఎలైట్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్స్ లో అందించింది. ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వివో వి 70 ఎలైట్ (8GB + 256GB) వేరియంట్ ప్రైస్ : రూ. 51,999
వివో వి 70 ఎలైట్ (12GB + 256GB) వేరియంట్ ప్రైస్ : రూ. 56,999
వివో వి 70 ఎలైట్ (12GB + 512GB) వేరియంట్ ప్రైస్ : రూ. 61,999
ఈ ఫోన్ ఆథెంటిక్ బ్లాక్, పాషన్ రెడ్ మరియు శాండ్ బీజ్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ ను వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు 10% అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ లను అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. ఇది కాకుండా రూ. 1,499 రూపాయల వివో బడ్స్ ను కూడా ఈ ఫోన్ తో ఉచితంగా అందిస్తుంది.
Also Read: కేవలం రూ. 2,499 ధరతో డ్యూయల్ డ్రైవర్ ANC బడ్స్ లాంచ్ చేసిన GOBOULT
వివో వి70 ఎలైట్ లో కూడా 3D అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన కాంపాక్ట్ 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ ఫీచర్స్ కలిగి ఉంది. అయితే, ఈ వివో ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ గరిష్టంగా 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ UFS 4.1 హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇది వివో వి70 ఫోన్ కలిగిన అదే 50MP ZEISS మెయిన్ కెమెరా, 50MP ZEISS నైట్ టెలిఫోటో మరియు 8MP ZEISS అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కలిగి ఉంది. ముందు కూడా అదే 50MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 3x ఆప్టికల్ జూమ్ మరియు 100x డిజిటల్ జూమ్ తో వస్తుంది. అయితే, ఈ ఫోన్ 60FPS 4K స్టేబుల్ వీడియోలను మరింత అందంగా చిత్రిస్తుంది. దీనికి ఈ ఫోన్ కలిగిన సూపర్ ఏఐ చిప్ సెట్ సహకరిస్తుంది.
ఈ ఫోన్ లో 6500 mah బిగ్ బ్లూవోల్ట్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ కూడా బైపాస్ ఛార్జ్ ఫీచర్ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంది. IP68 అండ్ IP69 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో ఈ ఫోన్ వచ్చింది.