వివో ఫస్ట్ 200MP ఫోన్ Vivo V60e ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో.!

Updated on 02-Oct-2025
HIGHLIGHTS

సిరీస్ నుంచి మొదటిసారి 200MP మెయిన్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

Vivo V60e ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది

వివో వి60e స్మార్ట్ ఫోన్ 200MP కెమెరా కలిగిన మొదటి ఫోన్ అవుతుంది

వివో బెస్ట్ కెమెరా సిరీస్ గా చెప్పబడే V సిరీస్ నుంచి మొదటిసారి 200MP మెయిన్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అదే, Vivo V60e స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో టీజర్ ద్వారా అర్థం అవుతుంది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.

Vivo V60e లాంచ్ డేట్?

వివో వి60e స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ చాలా సింపుల్ అండ్ సూపర్ డిజైన్ తో లాంచ్ కాబోతున్నట్లు ఈ ఫోన్ ఇమేజెస్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం వివో అధికారిక వెబ్సైట్ నుంచి వివో అందించిన టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా అందించింది.

Vivo V60e కీలక ఫీచర్స్ ఏమిటి?

వివో వి60e స్మార్ట్ ఫోన్ 200MP కెమెరా కలిగిన మొదటి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ 200MP మెయిన్ కెమెరా జతగా 8MP వైడ్ యాంగిల్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ అల్ట్రా హై డెఫినేషన్ ఫోటోలు మరియు సూపర్ క్లారిటీ కలిగిన వీడియోలు అందిస్తుందని వివో గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇండియన్ యూజర్లకు తగిన AI ఫెస్టివల్ పోర్ట్రైట్ మరియు AI ఫోర్ సీజన్ పోర్ట్రైట్ వంటి మరిన్ని AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

డిజైన్ పరంగా, ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గొప్ప స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో చాలా తక్కువ అంచులు కలిగిన అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ఉంటుంది. వివో వి60e స్మార్ట్ ఫోన్ ఫన్ టచ్ OS సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 3 మేజర్ OS అప్డేట్స్ మరియు 5 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

Also Read: Flipkart Sale చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 11 వేలకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ లభిస్తోంది.!

వివో వి60e స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6,500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఇది 90W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను బిల్ట్ ఇన్ Gemni AI సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా వివో అనౌన్స్ చేసింది.

ఈ అప్ కమింగ్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే వివో బయటకు వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ నోబెల్ గోల్డ్ మరియు ఎలైట్ పర్పల్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :