vivo announce huge price cut on vivo y27 and vivo t2 phones
Vivo ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన రెండు స్మార్ట్ ఫోన్ల పైన భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో వివో ఇటీవల విడుదల చేసిన 4G ఫోన్ వివో Y27 మరియు వివో బడ్జెట్ 5జి ఫోన్ వివో T2 5జి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల పైన భారీ తగ్గింపుతో లిస్టింగ్ చేసింది వివో. వివో వై27 మరియు వివో టి2 స్మార్ట్ ఫోన్స్ పైన వివో చేసిన ప్రైస్ కట్, లేటెస్ట్ ప్రైస్ మరియు స్పెక్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
వివో వై27 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ. 14,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ పైన వివో ఇప్పుడు రూ. 3,000 రూపాయల తగ్గింపును అందించింది.ఆ అందుకే, ఈ ఫోన్ ఇప్పుడు రూ. 11,999 రూపాయల ధరకే లభిస్తోంది.
ఇక వివో టి2 విషయానికి వస్తే, ఈ ఫోన్ ను కంపెనీ ఇండియాలో రూ. 18,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అలాగే, హై ఎండ్ వేరియంట్ ను రూ. 20,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు వివో ఈ ఫోన్ల పైన రూ. 3,000 తగ్గింపు ప్రకటించడంతో ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (6GB+128GB) రూ. 15,999 రూపాయలకు మరియు హై ఎండ్ వేరియంట్ (8GB+ 128GB) రూ. 17,999 ధరకే లభిస్తున్నాయి.
Also Read: Paytm కు షాకిచ్చిన RBI..మరి యూజర్ల సంగతి ఏంటి.!
వివో టి2 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 695 ఆక్టా కోర్ ప్రోసెసర్ జత 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.38 ఇంచ్ Full HD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ 7.8mm మందతో చాలా సన్నగా అందమైన డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ Android 13 OS పైన పని చేస్తుంది.
ఈ వివో ఫోన్ లో వెనుక 64MP OIS మెయిన్ + 2MP కెమేరా కలిగిన డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ ఫోన్ ను 4400mAh బిగ్ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.