Vijay Sales apple days sale offers big deals iPhone 17 Pro today
Vijay Sales కొత్తగా యాపిల్ డేస్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ 2025 క్లోజింగ్ మరియు న్యూ ఇయర్ స్టార్టింగ్ రోజుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. విజయ్ సేల్స్ కొత్తగా అందించిన ఈ సేల్ నుంచి iPhone 17 Pro పై భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. మీరు కూడా యాపిల్ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్ కొనాలని సెర్చ్ చేస్తుంటే, ఈ కొత్త సేల్ నుంచి లభిస్తున్న ఐఫోన్ 17 ప్రో డీల్ పరిశీలించవచ్చు.
విజయ్ సేల్స్ ఈ నెల 28వ తేదీ నుంచి ఈ యాపిల్ డేస్ సేల్ అనౌన్స్ చేసింది మరియు ఈ సేల్ 2026 జనవరి 4వ తేదీతో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు యాపిల్ ఐఫోన్ 17 ప్రో ఫోన్ పై భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. ఐఫోన్ 17 ప్రో ఇండియాలో రూ. 1,34,900 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు విజయ్ సేల్ ఈ ఫోన్ రూ. 9,410 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 1,25,490 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది.
ఈ ఫోన్ పై మరో రెండు ఆఫర్లు కూడా విజయ్ సేల్స్ ఆఫర్ చేస్తోంది. ICICI క్రెడిట్ / డెబిట్ కార్డు రూ. 5,000 డిస్కౌంట్ ఆఫర్, SBI క్రెడిట్ కార్డు రూ. 4,000 డిస్కౌంట్ ఆఫర్ మరియు IDFC FIRST మరియు HDFC క్రెడిట్ కార్డు పై కూడా రూ. 4,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఈ ఫోన్ పై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఇది డివైజ్ బట్టి మారుతుంది కాబట్టి మీరు విజయ్ సేల్స్ నుంచి మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ బోనస్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. టోటల్ గా యాపిల్ ఐఫోన్ 17 ప్రో పై 15 వేల పై చిలుకు డిస్కౌంట్ ను అందుకునే అవకాశం విజయ్ సేల్స్ కొనుగోలుదారులకు అందించింది.
Also Read: Aadhaar Pan Card Link గడువు రేపటితో ముగుస్తుంది.. ఎలా చేయాలో తెలుసుకోండి.!
ఐఫోన్ 16 సిరీస్ ప్రో స్మార్ట్ ఫోన్ యాపిల్ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్. ఇది 6.3 ఇంచ్ సూపర్ XDR రెటీనా డిస్ప్లే తో ఉంటుంది. ఇందులో డైనమిక్ ఐలాండ్ మరియు ప్రో మోషన్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ అల్యూమినియం యూని బాడీ డిజైన్ మరియు సిరామిక్ షీల్డ్ బ్యాక్ తో ఉంటుంది. ఈ లేటెస్ట్ ఐఫోన్ A19 Pro chip తో పని చేస్తుంది మరియు యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 48MP ఫ్యూజన్ మెయిన్, 48MP అల్ట్రా వైడ్ మరియు 48MP ఫ్యూజన్ టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 18MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ టన్నుల కొద్దీ యాపిల్ కెమెరా ఫీచర్స్ మరియు యాపిల్ ఇంటెలిజెన్స్ జతగా ఉంటుంది. వీడియో పరంగా, ఈ ఫోన్ 120 FPS వద్ద 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.