షావోమి, బడ్జెట్ ధరలో విజయవంతమైన రెడ్మి Y2 యొక్క తరువాతి తరం స్మార్ట్ ఫోనుగా Redmi Y3 ని, అతిత్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభంధించిన ఒక టీజింగ్ వీడియోను కూడా తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ గురువారం నాడు అందించింది. ఈ టీజింగ్ వీడియోలో, త్వరలో రానున్నట్లు చెబుతున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించిన పూర్తి స్పెక్స్ మాత్రం వివరించలేదు కానీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువకాలం పనిచేసే బ్యాటరీ మరియు ఒక 32MP సెల్ఫీ కెమేరాతో ఉండనునట్లు మాత్రం తెలుస్తోంది. వాస్తవానికి దీన్ని సంస్థ Y3 ఫోను అని నేరుగా ప్రకటించలేదు కానీ, ఇక్కడ Y సిరీస్ లో భాగంగా అని సూచింది కాబట్టి, ఇది రెడ్మి Y3 కావచ్చని అంచనా వేస్తున్నారు.
అనుకునట్లుగా ఇది రెడ్మి Y3 కనుక అయినట్లయితే, ముందుగా వచ్చినటువంటి రెడ్మి Y2 స్మార్ట్ ఫోన్ కలిగివున్నటువంటి 3080 mAh బ్యాటరీ కంటే అధికమైనశక్తీ కలిగిన ఒక 5000 mAh బ్యాటరీని అందించవచ్చని అంచనా వేస్తున్నారు. రెడ్మి Y2 కంటే మెరుగైన సాఫ్ట్ వేర్ మరియు అప్డేట్లతో ఉండవచ్చు. సాధారణంగా, రెడ్మి Y సిరీస్ స్మార్ట్ ఫోన్లు సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లుగా ఉంటాయి కాబట్టి, ఇందులో రెడ్మి Y2 లో అందించిన 16MP సెల్ఫీ కెమేరాకు అప్డేటుగా 32MP సెల్ఫీ కెమేరాను ఇవ్వనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముందుగా పైన సెప్పిన విషయాలకు బలం చేకూర్చేలా, షావోమి అందించిన టీజింగ్ వీడియోకి షావోమి అభిమానులు ఇచ్చిన కామెంట్లలో ఈ స్మార్ట్ ఫోనులో వారు ఏ అంశాలు ఉండవచ్చని వేసిన అంచనాలు మరియు ముందస్తు ఊహలు కనిపిస్తున్నాయి. అధనంగా, రానున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ గురించి మాట్లడితే గనుక ఈ ఫోన్ యొక్క సెల్ఫీ కేమేరాతో తీసిన ఒక సెల్ఫీలో మనూకుమార్ జైన్ మరియు ఆఫీసులోని అనేకమంది కూడా కనిపించారు, దీన్ని బట్టి ఇది అత్యధికమైన రిజల్యూషన్ కెమేరా ఫోనుగా అనిపిస్తోంది.
This is what happened when @manukumarjain got his hands on the upcoming #Redmi phone.
Why is Manu on selfie spree? #YYY?