upcoming phone with Snapdragon 8 Elite Gen 5 list
భారీ ఫీచర్స్ మరియు శక్తితో క్వాల్కమ్ లాంచ్ చేసిన Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో కొత్త ఫోన్లు ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ చిప్ సెట్ 40 మిలియన్ AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుంది మరియు ఈ శక్తికి తగిన ర్యామ్ ని జోడిస్తే ఆ ఫోన్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ అందిస్తుంది. మరి ఇంత శక్తివంతమైన చిప్ సెట్ తో ఇండియాలో మొదటగా విడుదల కావడానికి సిద్ధమైన ఆ ఫోన్లు ఏమిటో చూద్దామా.
స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో లాంచ్ కావడానికి రెండు ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటి OnePlus 15 స్మార్ట్ ఫోన్ కాగా రెండోది iQOO 15 స్మార్ట్ ఫోన్. ఈ రెండు ఫోన్ల లాంచ్ గురించి వాటి కంపెనీలు టీజింగ్ మొదలు పెట్టాయి. ఈ రెండు ఫోన్ల లాంచ్ గురించి వాటి కంపెనీలు చెబుతున్న ఫీచర్స్ మరియు విశేషాలు ఏమిటో చూద్దామా.
Also Read: POCO F7 5G స్మార్ట్ ఫోన్ రూ. 4,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కోసం సిద్దమయ్యింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ చైనా లాంచ్ తర్వాత ముందుగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్ మరియు పవర్ ఫుల్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఆక్సిజన్ OS 16 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 16 OS తో కూడా వస్తుంది. ఈ ఫోన్ మరింత శక్తివంతమైన AI సపోర్ట్ తో ఉంటుందని వన్ ప్లస్ చెబుతోంది. ఈ ఫోన్ వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ కావచ్చని చెబుతున్నారు.
ఐకూ యొక్క ఈ అప్ కమింగ్ ఫోన్ నవంబర్ నెలలో ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా కంపెనీ అందించిన టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అర్ధమవుతాయి. ఈ ఫోన్ కూడా స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ కూడా ప్రత్యేకమైన AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫోన్ కూడా వివో యొక్క లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఆరిజిన్ OS 6 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ పెద్ద కెమెరా బంప్, సూపర్ రిజల్యూషన్ కెమెరా మరియు అదిరిపోయే సరికొత్త డిజైన్ తో ఇండియా లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.