OPPO R17 Pro పైన మొత్తంగా Rs.16,000 ధర తగ్గింపు
ముందుగా, రూ. 45,990 విలువ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ అయిపోనటువంటి OPPO R17 Pro ఫోన్ పైన రూ 6000 తగ్గింపు చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర పైన మరొకసారి 10,000 రూపాయలకు తగ్గించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 29,990 ధరతో విక్రయించబడుతోంది.
OPPO, ఇప్పుడు చాల స్మార్ట్ ఫోన్ ధరలలో మార్పులు చేసింది. ముందుగా, రూ. 45,990 విలువ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ అయిపోనటువంటి OPPO R17 Pro ఫోన్ పైన రూ 6000 తగ్గింపు చేసింది. అటుతరువాత, ముంబయికి చెందిన ఆన్లైన్ రిటైలర్ మహేష్ టెలికాం ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ ధర పైన మరొకసారి 10,000 రూపాయలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 29,990 ధరతో విక్రయించబడుతోంది. అలాగే, Oppo A7 స్మార్ట్ ఫోన్ కూడా రూ .16,990 ధరతో విడుదలా చేయగా, ఏప్రిల్ నెలలో ఈ ఫోన్ యొక్క ధర 1,000 రూపాయల వరకు తగ్గించబడింది. ఇక ఇప్పుడు దీని ధరపైన మరొక 2000 రూపాల ధరను తగ్గించి, కేవలం రూ. 13,990 ధరతో అందిస్తుంది మరియు కొనుగోలుదారులకు మంచి లాభాలను అందిస్తుంది.
Surveyఒప్పో R17 ప్రో : ప్రత్యేకతలు మరియు లక్షణాలు
ఒప్పో R17 ప్రో, 2340×1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియాతో ఒక 6.4-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లే కలిగి ఉంది. డిస్ప్లేలో "వాటర్ డ్రాప్ " నోచ్ ఉంది, ఇది ఈ ఫోన్ 91.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోని సాధించడానికి సహయపడుతుంది. ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది మరియు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది. ఈ ఒప్పో సామ్రాట్ ఫోన్, కేవలం 0.41 సెకన్లలో స్మార్ట్ ఫోన్నిసమర్ధవంతంగా అన్లాక్ చేస్తుంది.
ఒప్పో R17 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 SoC (డ్యూయల్ 2.2GHz Kryo 360 + Hexa 1.7GHz Kryo 360 CPU లు) శక్తితో మరియు అడ్రినో 616 GPU గ్రాఫిక్స్ తో కలిసి ఉంటుంది. ఒక 8GB RAM + 128GB స్టోరేజి వేరియంట్, Android 8.1 (Oreo)తో స్మార్ట్ ఫోన్ వస్తుంది మరియు ColorOS 5.2 పై అమలవుతుంది.
ఫోటోగ్రఫీ పనితీరు విషయానికి వస్తే, వెనుక డ్యూయల్ – కెమెరా సెటప్ మరియు ముందు ఒకే కెమేరా ఇవ్వబడ్డాయి. వెనుకభాగంలో, ప్రాధమిక 12MP కెమెరా వేరియబుల్ ఎపర్చరు (f / 1.5 మరియు f / 2.4) తో వస్తుంది, అది కాంతి లభ్యతపై ఆధారపడి మారుతుంది. ద్వితీయ 20MP కెమెరా పోర్ట్రైట్ షాట్లు తీయడంలో సహాయపడుతుంది. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ (TOF) 3D సెన్సింగ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇవి నానో సెకండ్ ఇన్ఫ్రారెడ్ మెజెర్మెంట్ ద్వారా అధిక-లోతైన 3D డెప్త్ సమాచారం పొందవచ్చు. ముందు 25MP AI కెమెరాని అందించారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
