కేవలం రూ.8,999 ధరకే 13MP + 8MP + 2MP ట్రిపుల్ కెమేరా ఫోన్ : రేపే మొదటి సేల్

Updated on 27-May-2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 32MP సెల్ఫీ కెమెరా,వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే, 4000mAh బ్యాటరీ వంటి గొప్ప స్పెక్స్ తో ప్రారంభించింది.

Infinix సంస్థ  మరొక ట్రిపుల్ కెమేరా ఫోన్ను మరిన్ని గొప్ప ప్రత్యేకతలతో తీసుకోచ్చింది. అదే ఇన్ఫినిక్స్ S4 స్మార్ట్ ఫోన్, దీన్ని భారతదేశంలో ప్రారంభించింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఒక 32MP సెల్ఫీ కెమెరా,వెనుక  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే, 4000mAh బ్యాటరీ వంటి గొప్ప స్పెక్స్ తో ప్రారంభించింది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరను మాత్రం కేవలం 8,999 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ఫోన్ 3GB RAM మరియు 32GB స్టోరేజితో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి జరగనుంది. 

INFINIX S4 ప్రత్యేకతలు

ఈ INFINIX S4 స్మార్ట్ ఫోన్  ఒక 6.21 అంగుళాల HD + వాటర్ డ్రాప్ నోచ్ మరియు 720X1520 p రిజల్యూషనుతో వస్తుంది. ఇక ఇందులో ముందు మరియు వెనుకభాగంలో కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణతో సంస్థ అందించింది. ఈ స్మార్ట్ఫోన్ను ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.0 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ కి పవర్ అందించాడని ఒక పెద్ద 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 3GB ర్యామ్ మరియు 32GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది. 

ఈ  Infinix S4 కెమేరాల గురించి  మాట్లాడితే,  వెనుకభాగంలో  13 మెగాపిక్సెల్ (f2.0) ప్రధాన కెమేరాకి జతగా మరొక 8MP ,మరియు 2MP కలిపిన ఒక  ట్రిపుల్ రియర్ కెమేరాని ఇందులో అందించారు.  ఈ 2MP సెన్సార్ డెప్త్ సెన్సార్ కాగా, 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ని అందించారు. ఈ వెనుక కెమెరా క్వాడ్ LED ఫ్లాష్, ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 32-MP AI కెమెరాని కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

అధనపు ఫీచర్ల విషయానికి వస్తే, Bluetooth 5.0 డివైజ్ కనెక్టివిటీ, 3.5mm ఆడియో జాక్, FM , OTG, ట్రిపుల్ సిమ్ స్లాట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జ్ఫింగెర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచరుతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నునెబ్యులా బ్లూ, ట్విలైట్ పర్పుల్ మరియు స్పేస్ గ్రే వంటి కలర్ ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ . 8,999 రూపాయిలుగా నిర్ణయించింది మరియు దీని అమ్మకాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకి  Flipkart  నుండి ప్రారంభమవుతాయి. మీరు జియో వినియోగదారులు గనుక అయితే, మీరు ఈ పరికరంతో రూ .4500 వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :