మరికొద్ది సేపట్లో లాంచ్ కానున్న VIVO U 20 స్మార్ట్ ఫోన్ : LIVE చూడండి ఇలా

Updated on 22-Nov-2019
HIGHLIGHTS

ఈ వివో యు 20 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నోచ్‌ ను ప్యాక్ చేస్తుంది .

ఈరోజు, వివో సంస్థ తన VIVO U20 స్మార్ట్ ఫోన్నువిడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఈ వివో యు 20 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నోచ్‌ ను ప్యాక్ చేస్తుంది . ఇంకా, ఈ స్మార్ట్‌ ఫోన్ 6 జీబీ ర్యామ్‌ తో జతచేయబడిన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 AIE చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వనుంది. ఇది UFS 2.1 స్టోరేజిను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ని ఈ క్రింద LIVE గా చూడవచ్చు. 

ముందుగా వచ్చిన టీజర్ ద్వారా, వివో యు 20 ముందు మరియు వెనుక వైపు చూపిస్తోంది. ఈ ఫోన్ గ్రేడియంట్ డిజైనులో కనిపిస్తుంది. వెనుకవైపు, LED ఫ్లాష్‌ తో వేలిముద్ర సెన్సార్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు, కాని సెన్సార్ల స్పెసిఫికేషనుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ముందు వైపు, ఒక చిన్న నోచ్ మరియు దిగువ ఒక చిన్న చిన్ చూడవచ్చు.

టీజర్ పేజీ ప్రకారం, వివో యు 20 నవంబర్ 22 న భారతదేశంలో విడుదల కానుంది. ఇది అమెజాన్-ప్రత్యేకమైన డివైజుగా వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోనులో స్నాప్డ్రాగన్ 675 చిప్సెట్ గురించి టీజర్ మరింత ప్రస్తావించింది. దాని ముందున్న వివో యు 10 కి శక్తినిచ్చే స్నాప్‌డ్రాగన్ 665 SoC కంటే ఈ చిప్సెట్ 25 శాతం (AnTuTu బెంచ్‌మార్క్ స్కోరు పరంగా) పనితీరును పెంచుతుందని పేజీ పేర్కొంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :