ఈ మద్యహ్నం 12 గంటలకి విడుదలకానున్నRedmi Go రెడ్మి గో

HIGHLIGHTS

ఇది Android Go- Powered స్మార్ట్ ఫోన్.

ఈ మద్యహ్నం 12 గంటలకి విడుదలకానున్నRedmi Go రెడ్మి గో

షావోమి, ఇప్పుడు తన స్మార్ట్ ఫోన్లను భారతదేశంలో వెంటవెంటనే విడుదలచేస్తోంది.ఇటీవలే, షావోమి రెడ్మి నోట్ 7 మరియు షావోమి రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చేసింది. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి Android Go- Powered స్మార్ట్ ఫోన్ అయినటువంటి, Redmi Go ని ఇండియాలో విడుదలచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్, 20 కి పైగా భారతీయ భాషలను కలిగివుంటుంది మరియు ప్రత్యేకంగా హిందీ భాషలో "Google Assistance" ని కూడా కలిగివుంటుంది.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఫోన్  16: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి అంచులు కలిగి ఉంటుంది మరియు ఈ డివైజ్ యొక్క వెనుకవైపు ఉన్న ఒక ఎడమ మూలలో సింగల్ కెమెరా మరియు ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నాయి. హార్డ్వేర్ పరంగా, రెడ్మి గో 1280x720p రిజల్యూషను అందించగల, ఒక 5-అంగుళాల LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునేలా,  8GB&16GB ఇంటర్నల్ స్టోరేజితో పాటుగా 1 జీబి ర్యామ్ తో జతగా ఈ హ్యాండ్ సెట్ లభిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8MP ఒకే వెనుక కెమెరాతో f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్ పరిమాణంతో వస్తుంది. ముందు, ఇది ఒక 5MP సెన్సారుని కలిగివుంది.  ఇది 1.12μm పిక్సెల్ పరిమాణం మరియు ఒక f / 2/2 ఎపర్చరుతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ద్వారా నడిచే  ఈ హ్యాండ్సెట్, ఒక 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ రకాలు మరియు డ్యూయల్ సిమ్ మద్దత్తుతో లభిస్తుంది. ఇక రేపు ఇండియాలో విడుదలయ్యే సమయానికి ఎటువంటి స్పీక్స్ అందిస్తుందో చూడాలి.    

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo