ఈ రోజు విడుదలకానున్న షావోమి Redmi 7 స్మార్ట్ ఫోన్
ఈ రెడ్మీ 7 స్మార్ట్ ఫోన్ 2GB, 3GB మరియు 4GB RAM వేరియంట్లలో మరియు 16GB, 32GB మరియు 64GB అంతర్గత స్టోరేజి ఎంపికలతో విడుదలకానునట్లు తెలుస్తోంది.
ముందుగా, Redmi 7స్మార్ట్ ఫోన్ TENAA Listing లో కనిపించింది. ఈ జాబితా ప్రకారం, Redmi 7 మోడల్ సంఖ్యని M1810F6LE గా చూపిస్తుంది మరియు ఒక 1520 × 720p రిజల్యూషన్ గల ఒక 6.26-అంగుళాల TFT HD + డిస్ప్లేతో వుడనున్నట్లు చెబుతోంది. ఈ ఫోన్ యొక్క మొదటి ప్యానెల్ యొక్క చిత్రం, అది ఒక వాటర్ డ్రాప్ నోచ్ రూపకల్పనలో ఉన్నట్లు సూచిస్తుంది, ఇది రెడ్మి నోట్ 7 హ్యాండ్ సెట్ల శ్రేణి వలన కనిపిస్తుంది. అయితే, ఈ చిత్రాలు అంత స్పష్టంగా లేకపోవడం వలన పూర్తిగా నిర్ధారించలేకపోవచ్చు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో ఈ రోజు విడుదలకానుంది మరియు దీనితో పాటుగా రెడ్మి నోట్ 7 ప్రో ని కూడా చైనాలో విడుదల చేయనున్నారు.
Surveyకొన్ని నివేదికల ప్రకారం, ఈ రెడ్మీ 7 స్మార్ట్ ఫోన్ 2GB, 3GB మరియు 4GB RAM వేరియంట్లలో మరియు 16GB, 32GB మరియు 64GB అంతర్గత స్టోరేజి ఎంపికలతో విడుదలకానునట్లు తెలుస్తోంది. వెనుక 12MP + 8MP సెన్సార్లతో ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్పును కలిగి ఉంటుంది. అయితే, ముందు కెమెరా యొక్క సెటప్ గురించిన సమాచారం లేదు. అదనంగా, ఈ పరికరం Android 9 Pie మరియు 3,900mAh బ్యాటరీతో వస్తుందని కూడా తెలుస్తోంది. అలాగే, ఈ ఫోన్ వెనుకభాగంలో ఒక వేలిముద్ర సెన్సార్ తో ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ వెనుక ప్యానెల్ చూడడానికి, రెడ్మీ నోట్ 7 సిరీస్ కి సమానంగా, ఒక గ్రేడియంట్ డిజైన్ కలిగి ఉండవచ్చని కూడా సమాచారం.
ముందు పేర్కొన్నట్లు, Xiaomi ఇటీవల భారతదేశంలో విడుదలచేసిన రెడ్మి నోట్ 7 ప్రో ఇప్పుడు చలియా కూడా విడుదలకానుంది. ఈ రెడ్మి నోట్ 7 ప్రో ఒక స్నాప్ డ్రాగన్ 675 SoC చే శక్తిని కలిగి ఉంది మరియు ఇది 48MP ప్రధాన కెమెరాతో వస్తుంది. ఈ రెడ్మి నోట్ 7 ప్రో 4GB మరియు 6GB RAM రకాల్లో లభిస్తుంది మరియు రూ. 13,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile