ఈ రోజు నుండి మొదలైన రియల్మీ వార్షికోత్సవ సేల్ : సూపర్ డీల్స్ మీ సొంతం చేసుకోండి

Updated on 02-May-2019
HIGHLIGHTS

ఇందులో భాగంగా Realme 2 Pro, Realme U1 వంటి ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తోంది

రియల్మీ 3 యొక్క ఒక కొత్త 3GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ ని కూడా సేల్ చేయనుంది.

రియల్మీ, ఒప్పో నుండి విడిపోయి సొంత బ్రాండ్ గా మార్కెట్లోకి ప్రవేశించి ఒక సంవత్సరం అవుతుండగా, సంస్థ తన వినియోగదారులకి మరియు అభిమానుల కోసం కొత్త రియల్మీ వార్షికోత్సవ సేల్ ఆఫర్లను తీసుకోచింది. ఇందులో భాగంగా Realme 2 Pro, Realme U1 వంటి ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తోంది మరియు రియల్మీ 3 యొక్క ఒక కొత్త 3GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ ని కూడా సేల్ చేయనుంది.

Realme 2 Pro ఆఫర్లు

Realme 2 Pro స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని రకాల వేరియంట్ల పైన కూడా 1,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ ద్వారా రియల్మీ 2 ప్రో యొక్క సాధారణ వేరియంట్ 4GB + 64GB వేరియంటును Rs. 10,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, 6GB + 64GB వేరియంటును Rs. 12,990 ధరకు మరియు 8GB + 128GB వేరియంటును Rs. 14,990 ధరకు అందిస్తోంది.ఈ అఫర్లకు అధనంగా, Mobikwik నుండి కొనుగోలు చేసేవారికి, 15%తగ్గింపుని అందుకుంటారు.

Realme U1 ఆఫర్లు

Realme U1 స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని రకాల వేరియంట్ల పైన కూడా 1,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్ ద్వారా Realme U1 యొక్క సాధారణ వేరియంట్ 3GB + 32GB వేరియంటును కేవలం Rs. 8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, 3GB + 64GB వేరియంటును Rs. 10,499 ధరకు మరియు 4GB + 64GB వేరియంటును Rs. 10,999 ధరకు అందిస్తోంది.ఈ అఫర్లకు అధనంగా, Mobikwik నుండి కొనుగోలు చేసేవారికి, 15%తగ్గింపుని అందుకుంటారు. 

అలాగే, రియల్మీ3 స్మార్ట్ ఫోన్ యొక్క 3GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి వేరియంట్ ని ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకి ఫస్ట్ సేల్ ద్వారా అందించనుంది.    

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :