రియల్మీ 3 ప్రో 32MP సెల్ఫీ కెమేరాతోఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ కానుంది

Updated on 22-Apr-2019

రియల్మీ 3 యొక్క ప్రో వర్షన్ అయినటువంటి రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీరు కూడా ఒకరైతే, ఆ రోజు రానే వచ్చేసింది. రియల్మీ 3 ప్రో ఒక 32MP సెల్ఫీ కెమేరాతోఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ కానుంది. ఆన్లైన్లో లీకైన స్పెక్స్ ఈ స్మార్ట్ ఫోను యొక్క అన్ని వివరాలను పూర్తిగా  వివరిస్తున్నాయి. గీక్ బెంచ్ లో వెల్లడైన వివరాల ప్రకారం, Realme RMX1851 మోడల్ నంబరుతో రియల్మీ యొక్క స్మార్ట్ ఫోన్ దర్శనమిచ్చింది. అయితే, ఇది త్వరలో విడుదలకానున్న రియల్మీ స్మార్ట్ ఫోనుగా స్పష్టమైంది.

ఈ Realme RMX1851 మోడల్ నంబరుతో చూపించిన డివైజ్, ఒక స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ మరియు 6GBRAM తో రానున్నట్లు లిస్టింగ్ చెయ్యబడింది. అలాగే, ఇది ఒక ఆండ్రాయిడ్ 9 ఫై OS తో నడవనునట్లు కూడా చూపించింది. అలాగే, మరికొన్ని ఆన్లైన్ వేదికలపైన అందించిన లీక్ లను పరిశీలిస్తే, ఇది కలర్ OS 6.0 పైన అధరాతమై నడవనునట్లు తెలుస్తోంది. ముందుగా వచ్చిన రియల్మీ 3 నుండి అప్డేటుగా ఏ స్మార్ట్ ఫోన్ రానున్నట్లయితే, ఇందులో మరుగైన రియర్ కెమేరా సెటప్ మరియు సెల్ఫీ కెమేరాని కూడా అందించవచ్చు.

ఇక రియల్మీ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించిన ప్రకారం, రియల్మీ 3 ప్రో కెమెరాల పరంగా మంచి ఫిచర్లను తీసుకురానునట్లు తెలుస్తోంది. ఇందులో అందించిన సూపర్ స్లో మోషన్ ఫీచరుతో మంచి వీడియోలను తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే, గేమింగ్ గురించి కూడా ఈ ఫోనులో మంచి స్పీడ్ అందించినట్లుగా ప్రకటిస్తోంది, రియల్మీతన ట్విట్టర్ పేజీలో. ఇక పూర్తిగా ఫోన్ యొక్క అన్ని వివరాలను తీసుకోవడానికి ఏప్రిల్ 22 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :