జియో డైలీ 2GB ఫ్రీ డేటా అఫర్ ఈ రోజుతో ముగియనుంది.

HIGHLIGHTS

ఈ టెలికం సంస్థ ఎంపికచేసిన కొంతమంది వినియోగదారులకి రోజువారీ 2GB ఉచిత డేటాని 4 రోజుల వరకూ అందిస్తుంది.

జియో డైలీ 2GB ఫ్రీ డేటా అఫర్ ఈ రోజుతో ముగియనుంది.

 తన వినియోగదారులను ఎప్పటికప్పుడు ఉచిత డేటాతో ఆశ్చర్యపరిచే రిలయన్స్ జియో, కొంత మంది వినియోగదారుల కోసం Jio Celebrations Pack ని మరొకసారి తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఈ టెలికం సంస్థ ఎంపికచేసిన కొంతమంది వినియోగదారులకి రోజువారీ 2GB ఉచిత డేటాని 4 రోజుల వరకూ అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అంటే, ఎంపికచేసిన ఈ వినియోగదారులకు 4 రోజులకుగాను మొత్తంగా 8GB డేటాని ఉచితంగా అందిస్తుంది. ఈ సెలబ్రేషన్ ప్యాక్ ని 2018, సెప్టెంబర్ నెలలో తీసుకువచ్చింది జియో. ఈ ఉచిత డేటా, తమకు అందుబాటులో ఉన్నదా, లేదా అని తెలుసుకోవడానికి వినియోగదారులు, వారి MyJio ఆప్ తనిఖీ చేయవచ్చు. ఇప్పటికే కొంతమంది వినియోగదారులు ఈ ఫోటిఫికేషన్ కూడా అందుకున్నారు. అయితే ,ఇప్పుడు మార్చి14 నుండి మార్చి17 వ తేదీ వరకు ఈఅఫర్ వర్తిస్తుంది.అంటే ఈ అఫర్ ఈ రోజుతో ముగుస్తుంది.   

ఈ అఫర్ కోసం, ఎంపికచేసిన ఈ వినియోగదారులకు అందించిన రోజువారీ 2GB అధిక డేటా యొక్క ఓచరును క్రెడిట్ చేసుకోవచ్చు. Myjio ఆప్ లోని MyPlan విభాగంలోకి వెళ్లి వారి ప్లాను యొక్క క్రింది భాగంలో జియో సెలబ్రేషన్ ప్యాక్ కనిపిస్తున్నది లేనిది చూడవచ్చు.  ఇక్కడ ఈ సెలబ్రేషన్ ప్యాక్ ని ఎప్పటివరకూ Resume చేసుకోవచ్చనే విషయాన్నీ కూడా చూడవచ్చు.

ఈ జియో సెలబ్రేషన్ ప్యాక్, జియో యొక్క రెండవ వార్షికోత్సవం సందర్భంగా తీసుకొచ్చింది మరియు గరిష్టంగా 10GB డేటా వరకూ అందించింది. అలాగే, దీపావళి సందర్భముగా జియో దివాళీ ధమాఖా ఆఫరును తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, 149 రూపాయల కంటే అధికమైన రీచార్జితో 100% కాష్ బ్యాక్ ని అందించింది.                                        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo