హువావే ఉప బ్రాండ్ అయినటువంటి హానర్ నుండి 20i స్మార్ట్ ఫోన్ ఈ రోజు చైనా లో విడుదలకానుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించిన గొప్ప విషయం ఏమిటంటే ఈ ఫోన్ వెనుక అందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్పుగా చెప్పొచ్చు. అంతేకాకుండా, ఇందులో ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో డిస్ప్లే ని కూడా అందించారు. ఈ స్మార్ట్ యొక్క విడుదల కార్యక్రమం, చైనా కాలమానం ప్రకారం 3 గంటలకి మొదలవుతుంది. అదే భారత కాలమానం ప్రకారంగా చూస్తే, మధ్యాహ్నం 12:30 గంటలకి మొదలవుతుంది.
హానర్ 20i యొక్క Live Stream చూడడం ఎలా?
హానర్ 20i లాంచ్ ఈవెంట్ హానర్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఈ మొబైల్ ఫోన్ ప్రత్యక్ష ప్రసారం 3PM CST మరియు 12:30 PM IST కి మొదలవుతుంది.
హానర్ 20i ప్రత్యేకతలు :
ఈ హానర్ 20i ఒక 1080×2340 పిక్సెల్ రిజల్యూషను అందించగల 6.21 అంగుళాల FHD+ డిస్ప్లేతో రానుంది. హువావే యొక్క సొంత ప్రాసెసర్ అయినటువంటి, హై సిలికాన్ కిరిణ్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుతో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ప్రస్తుతంఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న రూమర్ల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ జతగా 64GB స్టోరేజి, 4GB ర్యామ్ జతగా 128GB స్టోరేజి మరియు 6GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి వేరియంట్ వంటి మూడు వేరియంట్లలో లభించనుంది.
ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఒక ప్రధాన 24MP కెమెరాకి జతగా 8MP టెలిఫోటో లెన్స్ తో పాటుగా 2MP డెప్త్ సెన్సార్ కలిపి ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్పును ఈ ఫోనులో అందించినట్లు తెలుస్తోంది. అధనంగా, ఒక అత్యధికమైన రిజల్యూషన్ కలిగిన 32MP సెల్ఫీ కెమేరాను కూడా ఈ స్మార్ట్ ఫోను యొక్క ముందుభాగంలో వున్నా వాటర్ డ్రాప్ నోచ్ లోపల అందించారు. ఇక ఈ కెమేరాలకు AI సెన్సింగ్ కూడా ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీతో ఫోటోలను తీసుకోవచ్చు. ఈ ఫోన్ ఒక 3,400 mAh బ్యాటరీ మరియు 10W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందించబడుతుంది.