Nokia 4.2 ఈ రోజు ఇండియాలో విడుదలకానుంది

HIGHLIGHTS

Nokia 4.2 చాలా ప్రీమియం డిజైన్ తో ఉన్నట్లు కనబడుతోంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెస్సర్ శక్తితో నడుస్తుంది.

Nokia 4.2 ఈ రోజు ఇండియాలో విడుదలకానుంది

ముందుగా, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) లో ప్రదర్శించిన ఈ Nokia 4.2 స్మార్ట్ ఫోన్, ఇండియాలో లాంచ్ చెయ్యడం గురించి ఎన్నో రూమర్లు మరియు సంస్థ నుండి ఎన్నో టీజర్లు వచ్చిన తరువాత, ఎట్టకేలకు ఈ రోజు ఇండియాలో లాంచ్ చేయడనికి డేట్ ను సెట్ చేసింది. సంస్థ యొక్క వెబ్సైట్ లో అందించిన వివరాల ప్రకారం, ఇది చాలా ప్రీమియం డిజైన్ తో ఉన్నట్లు కనబడుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

నోకియా 4.2 ప్రత్యేకతలు

ఈ నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ 720 x 1520 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 5.71 అంగుళాల HD+ a-si TFT LCD డిస్ప్లేతో రానున్నది. అధనంగా, ఈ డిస్ప్లేని ఒక వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో అందించారు మరియు ఈ నోచ్ లో సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇది ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో, ఎక్కువ స్క్రీన్ స్థలాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెస్సర్ శక్తితో నడుస్తుంది. ఇది 2GB మరియు 3GB వేరియంట్లకు జతగా 16GB మరియు 32GB స్టోరేజిలతో లభిస్తుంది.  అలాగే, మైక్రో SD కార్డుతో 400GB వరకు మెమొరీ సామర్ధ్యాన్ని పెంచుకునే వీలుంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, f/2.2 అపర్చరు  కలిగిన ఒక 13MP ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP ( f/2.2) డెప్త్ కెమేరాతో, డ్యూయల్ రియర్ కెమెరాని అందించారు. ముందుభాగంలో, ఒక 8MP కెమేరాని f /2.0 అపర్చరుతో అందించారు. అయితే, ఇందులో గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక డేడికేటెడ్ బటన్ అందించింది. ఇందులో 3,000 mAh ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని అందించింది. ఇది Android 9 Pie OS పైన నడుస్తుంది మరియు ఆండ్రాయిడ్ వన్ కార్యక్రంలో భాగంగా ఉంటుంది కాబట్టి అప్డేట్లను త్వరగా అందుకుంటుంది.                                   

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile