షావోమి 48MP కెమేరా ఫోన్లయిన రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7S ఫ్లాష్ సేల్ : మధ్యాహ్నం 12 గంటలకి

HIGHLIGHTS

ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో 48MP ప్రధాన కెమెరాతో తీసుకొచ్చినటువంటి, రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7S యొక్క ఫ్లష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart, mi.com మరియు మి హోమ్ నుండి మొదలవనుంది.

కేవలం 48MP కెమేరా మాత్రమే కాకుండా ఈ ఫోన్లలో FHD+ వాటర్ డ్రాప్ నోచ్, గొప్ప ప్రాసెసర్ మరియు పెద్ద బ్యాటరీతో సహా మరెన్నో మంచి ప్రత్యేకతహలను అందించింది.

షావోమి 48MP కెమేరా ఫోన్లయిన రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7S ఫ్లాష్ సేల్ : మధ్యాహ్నం 12 గంటలకి

ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో 48MP ప్రధాన కెమెరాతో తీసుకొచ్చినటువంటి, రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7S యొక్క ఫ్లష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart, mi.com మరియు మి హోమ్ నుండి మొదలవనుంది. కేవలం 48MP కెమేరా మాత్రమే కాకుండా ఈ ఫోన్లలో FHD+ వాటర్ డ్రాప్ నోచ్, గొప్ప ప్రాసెసర్ మరియు పెద్ద బ్యాటరీతో సహా మరెన్నో మంచి ప్రత్యేకతహలను అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 7 ప్రో ధర

1. రెడ్మి నోట్ 7 ప్రో  – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 13,999

2. రెడ్మి నోట్ 7 ప్రో  – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 16,999

షావోమి రెడ్మి నోట్ 7S : ధర

1. షావోమి రెడ్మి నోట్ 7S –  3GB RAM + 32GB స్టోరేజి ధర – 10,999

2. షావోమి రెడ్మి నోట్ 7S –  4GB RAM + 64GB స్టోరేజి ధర – 12,999

షావోమి రెడ్మి నోట్ 7S :  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి నోట్ 7S స్మార్ట్ ఫోన్,  FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 256GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది సఫైర్ బ్లూ, ఒనిక్స్ బ్లాక్ మరియు రూబీ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP + 5MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమరా SAMSUNG GM1 సెన్సారుతో వస్తుంది మరియు 5MP కెమేరా పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 13MP AI కెమెరాని అందించారు. ఇందులో పోర్ట్రైట్, బొకేహ్ వంటి మరెన్నో ఎంపికలతో సెల్ఫీలను క్లిక్ చెయ్యొచ్చు. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రక్షణనిస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో  ప్రత్యేకతలు    

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా f/1.79 అపర్చరుతో మరియు 6P లెన్స్ తో అందించబడయింది.  ఈ సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సంస్థ వెల్లడించింది.            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo