TikTok అంటే మనందరికీ తెలిసిన, సుప్రసిద్ధ షార్ట్-వీడియో యాప్. అయితే, యాప్ యొక్క డెవలపర్ బైట్‌డాన్స్ చాలా సైలెంటుగా తన మొదటి స్మార్ట్ ఫోన్ను వెల్లడించారు. జియాంగ్వో ప్రో 3 (లేదా ‘నట్ ప్రో 3’) అని పిలువబడే ఫ్లాగ్ షిప్ – గ్రేడ్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో 2,899 యువాన్ల (రూ .29,051 సుమారు) ప్రారంభ ధరతో స్మార్టిసాన్ బ్రాండ్ పేరుతో అమ్మకానికి వచ్చింది. ఈ ఫోన్, ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్ సెట్ ఆధారితమైన ఈ Jianguo Pro 3, వినియోగదారులు టిక్ టాక్ యొక్క చైనీస్ వెర్షన్ డుయోయిన్ ను స్క్రీన్ లాక్ ఉన్నాసరే యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
స్మార్టిసాన్ యొక్క ప్రోడక్ట్ పేజీ ప్రకారం, ఈ జియాంగ్వో ప్రో 3 మూడు వేరియంట్లలో లభిస్తుంది అవి: 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్, 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్, మరియు 12 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్. ఈ జియాంగ్వో ప్రో 3 ఒక 6.39-అంగుళాల FHD + AMOLED స్క్రీన్ ను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కలిగి ఉంది. దీని వెనుక భాగంలో నాలుగు కెమెరాలను కలిగి ఉంది, వీటిలో ఒక ప్రధాన 48MP సోనీ IMX586 ప్రాధమిక సెన్సార్ అదీ కూడా f / 1.75 యొక్క ఎపర్చరుతో, అలాగే 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 8MP టెలిఫోటో లెన్స్ మరియు 5MP సూపర్-మాక్రో లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు ఒక f / 2.0 ఎపర్చరుతో ఒక 20MP కెమేరా ఉంటుంది.
ఈ ఫోన్, క్విక్ ఛార్జ్ 4+ 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. జియాంగ్వో ప్రో 3 ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా స్మార్టిసాన్ OS 3.0 తో నడుస్తుంది. ఈ ఫోన్ చైనాలో నలుపు, తెలుపు మరియు ‘మాట్సుటేక్’ (పుట్టగొడుగు ఆకుపచ్చ) రంగులలో అమ్ముడవుతోంది. అబాకస్ న్యూస్ యొక్క తాజా నివేదిక ప్రకారం, ఫోన్‌లోని టిక్‌టాక్ లోకల్ కెమెరా యాప్ లో కనిపించే ప్రత్యేక ఎఫెక్ట్స్ మరియు ఫిల్టర్‌లను కలిగి ఉంది. "ఇవి టిక్‌టాక్ వీడియోల మాదిరిగా కాకుండా, ఎంత పొడవునున్నవీడియోలకు వర్తించవచ్చు, ఇవి 60 సెకన్ల వరకు మాత్రమే ఉంటాయి."
బైట్‌డాన్స్ ప్రతినిధి నుండి జూలైలో రాయిటర్స్ అందుకున్న ఒక ప్రకటన ప్రకారం, జియాంగ్వో ప్రో 3 అనేది “మునుపటి స్మార్టిసాన్ ప్రణాళికల కొనసాగింపు, ఇది పాత స్మార్టిసాన్ యూజర్ బేస్ యొక్క అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఉంటుంది .” 2012 లో స్థాపించబడిన స్మార్టిసాన్ ”చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు, ఇది తన బ్రాండ్ పేరును కొనసాగించడానికి దాని పేటెంట్లలో కొన్నింటిని బైట్‌డాన్స్‌కు బదిలీ చేసింది. అయితే, జియాంగ్వో ప్రో 3 భారత మార్కెట్లోకి తీసుకొస్తుందో, లేదో అనే విషయం తెలియరాలేదు.