Tecno Spark 50 5G launched in India know the top features and price
Tecno Spark 50 5G: లాంగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ తో టెక్నో ఈరోజు స్పార్క్ 50 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ సరికొత్త డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టెక్నో ఫోన్ ఇండియా లో లాంచ్ అయిన ధర మరియు కంపెనీ ఈ ఫోన్ పై అందించిన లాంచ్ ఆఫర్స్ తో పాటు ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలు ఏమిటో చూద్దామా.
టెక్నో ఈ ఫోన్ ను 4 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరతో అందించింది. ఈ ఫోన్ 6 జీబీ + 128 జీబీ హైఎండ్ వేరియంట్ ను రూ. 18,999 రూపాయల లాంచ్ ధరతో అందించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి సేల్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ పై కంపెనీ ఎటువంటి అదనపు ఆఫర్స్ కూడా అందించలేదు. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు అఫీషియల్ సైట్ నుండి సేల్ అవుతుంది.
ఈ టెక్నో లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 (6nm) ప్రోసెసర్ తో జతగా 6 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది. ఇది మల్టీ టాస్కింగ్ కోసం తగిన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో 12 GB అదనపు ర్యామ్ ఫీచర్ ను కూడా టెక్నో అందించింది. ఇది ఫోన్ ను మరింత స్మూత్ గా నడపడానికి సహాయం చేస్తుంది. ఈ టెక్నో ఫోన్ HiOS 16 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16OS పై నడుస్తుంది.
ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. అయితే, ఫోన్ సన్నగా ఉన్నా కూడా MIL-STD-810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ టెక్నో కొత్త ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ LCD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ 20Hz రిఫ్రెష్ రేట్ మరియు 560 నిట్స్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Redmi 15A 5G: బడ్జెట్ సిరీస్ నుంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రెడ్ మీ.!
కెమెరా పరంగా, ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ కెమెరా జత AI సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6,500mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఛార్జ్ సపోర్ట్ తో ఆకట్టుకుంటుంది. 4×4 MIMO తో మంచి నెట్ వర్క్ సీకర్ గా ఉంటుంది మరియు అంతరాయం లేని నెట్ వర్క్ ఆఫర్ చేస్తుంది.