Tecno Spark 50 5G launch announced with big battery and new design
Tecno Spark 50 5G: టెక్నో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కొత్తగా టీజర్ ని విడుదల చేసింది. అదే, టెక్నో స్పార్క్ 50 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లు కూడా రివీల్ చేసింది.
టెక్నో స్పార్క్ 50 5జి స్మార్ట్ ఫోన్ ను మార్చి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో డేట్ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు రివీల్ చేసింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుందని క్లియర్ చేసింది.
టెక్నో స్పార్క్ 50 స్మార్ట్ ఫోన్ ఏరో స్పేస్ గ్రేడ్ 6 సిరీస్ అల్యూమినియం కెమెరా డెకో ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ సరికొత్త కెమెరా బంప్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో ఈ ఫోన్ పై భాగంలో పెద్ద బంప్ లో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ మంచి డిజైన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 1.5 మీటర్ డ్రాప్ టెస్ట్ తట్టుకున్న MIL-STD మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో వస్తుంది.
ఈ ఫోన్ మంచి నెట్ వర్క్ అందించే 4 x 4 MIMO సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో అందించిన సిస్టం తో ఈ ఫోన్ వీక్ నెట్ వర్క్ లో కూడా 2x వేగవంతమైన UPI పేమెంట్ కోసం సపోర్ట్ చేస్తుందని టెక్నో తెలిపింది. ఈ ఫోన్ లో కూడా ఎమర్జెన్సీ ఆఫ్ లైన్ కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నట్లు కూడా టెక్నో తెలిపింది. ఈ ఫోన్ ఫాంటసీ పర్పల్, మింట్ గ్రీన్, ఇన్క్ బ్లాక్ మరియు కెంపగనే గోల్డ్ నాలుగు రంగుల్లో లాంచ్ అవుతుంది.
Also Read: BSNL Super Offer: మరో వారంలో క్లోజ్ అవబోతున్న ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ మిస్ అవ్వకండి.!
టెక్నో స్పార్క్ 50 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ గురించి చాలా గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6500 mAh భారీ బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ వేగవంతమైన బ్యాటరీని మరింత వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా భారతీయ లోకల్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేసే Ella AI సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్లు కంపెనీ త్వరలో ప్రకటిస్తుంది.