Tecno Spark 20 launched with 32mp selfie and 50mp dual rear camera
Tecno Spark 20: టెక్నో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 32MP సెల్ఫీ మరియు 50MP కెమేరాతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 20 స్మార్ట్ ఫోన్ ను 10 వేల బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన స్పెక్స్ తో తీసుకు వచ్చినట్లు తెలిపింది. మరి టెక్నో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకుందామా.
టెక్నో స్మార్ట్ 20 స్మార్ట్ ఫోన్ ను రూ. 10,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 2వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ తో రూ. 4,897 రూపాయల విలువైన 19 OTTs సబ్ స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చని టెక్నో తెలిపింది.
Also Read: Lava Agni 2 5G పైన భారీ ఆఫర్లు ప్రకటించిన Amazon.!
టెక్నో స్పార్క్ 20 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. టెక్నో ఈ ఫోన్ ను మీడియాటెక్ Helio G85 ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB RAM + 8GB మెమొరీ ఫ్యూజన్ తో 16GB ర్యామ్ ఫీచర్ మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి వుంది.
ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ లో మంచి కెమేరా సెటప్ లను అందించింది. ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 32MP గ్లోయింగ్ సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ ను బంపింగ్ బాస్ మరియు క్లియర్ ట్రెబల్ అందించ గల డ్యూయల్ స్పీకర్లను DTS సౌండ్ టెక్నాలజీతో తీసుకు వచ్చినట్లు టెక్నో తెలిపింది.
ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని సాధారణ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను గ్రావిటీ బ్లాక్, నియాన్ గోల్డ్, సైబర్ వైట్ మరియు మ్యాజిక్ స్కిన్ బ్లూ అనే నాలుగు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.