Tecno Pova 7 5G launching with mini led design and wireless charge support
Tecno Pova 7 5G : టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టెక్నో పోవ 7 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ భారీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను సరికొత్త మినీ LED డిజైన్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్స్ తో పాటు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు టెక్నో ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.
టెక్నో పోవ 7 5జి స్మార్ట్ ఫోన్ జూలై 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ కోసం టెక్నో మరియు ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా చేస్తున్న టీజింగ్ పేజి నుంచి ఈ అప్ కమింగ్ కీలక ఫీచర్స్ గురించి వెల్లడించాయి.
టెక్నో పోవ 7 5జి స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్ ఫస్ట్ మల్టీ ఫంక్షనల్ డెల్టా ఇంటర్ఫేస్ కలిగిన మినీ LED డిజైన్ తో లాంచ్ చేస్తుంది. ఇది మూడ్ స్వింగ్స్ కోసం తగిన లైవ్ లైట్ సపోర్ట్ తో ఉంటుంది. ఇందులో వెనుక కెమెరా చుట్టూ ట్రయాంగిల్ LED లైట్ తో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో కూడా ఉండేలా టెక్నో చూసుకుంది.
ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది మరియు ఇందులో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 30W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ Ella AI సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో గొప్ప సిగ్నల్ కోసం 4×4 MIMO మరియు ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ సిస్టం కూడా ఉంటుంది.
పోవ 7 టీజీ స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెమరీ ఫ్యూజన్ 3.0, IP64 రేటెడ్ స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, IR రిమోట్, బ్లూటూత్ 5.4 సపోర్ట్ మరియు NFC వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Flipkart Sale నుంచి 23 వేలకే 55 ఇంచ్ 4K Dolby Vision స్మార్ట్ టీవీ అందుకోండి.!
పైన తెలిపిన ఫీచర్స్ టెక్నో తెలిపిన అఫీషియల్ ఫీచర్స్ కాగా, ఈ ఫోన్ 144 Hz రిఫ్రెష్ రేట్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ తో ఆకట్టుకునే అవకాశం ఉందని రూమర్స్ ఉన్నాయి. అయితే, ఈ ఫోన్ ఎలా ఉంటుందో చూడాలి.