Tecno Pova 5G: భారీ ఫీచర్లతో వచ్చిన టెక్నో 5G స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

ఈరోజు Tecno ఇండియాలో Tecno Pova 5G ను ఆవిష్కరించింది

Dimensity 900 తో సహా భారీ ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది

Tecno Pova 5G రూ.1,999 రూపాయల విలువ గల పవర్ బ్యాంక్ ను ఉచితం

ఈరోజు Tecno ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Tecno Pova 5G ను ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 900 చిప్ సెట్ తో సహా భారీ ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అంతేకాదు, 11GB వరకూ RAM ని సమకూర్చేలా మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ ఫోన్‌ ను టెక్నో అందించింది. ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి తెలుసుకుందాం.

Tecno Pova 5G: ప్రైస్

Tecno Pova 5G స్మార్ట్ ఫోన్ ను రూ.19,999 ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 14 నుండి అమెజాన్ నుండి అమ్మకానికి వస్తుంది. లాంచ్ అఫర్ క్రింద ఈ స్మార్ట్ ఫోన్ తో రూ.1,999 రూపాయల విలువ గల పవర్ బ్యాంక్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది.

Tecno Pova 5G: స్పెక్స్

టెక్నో పోవా 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.95 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ Dimensity 900 5G చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB LPDDR5 RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజ్‌ ని కలిగివుంది. ఈ ఫోన్ లో అందించిన మెమరీ ఫ్యూజన్ ఫీచర్ తో ర్యామ్ ను 11GB వరకూ వర్చువల్ ర్యామ్ గా విస్తరిస్తుంది. దీనికోసం ఇంటర్నల్ స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా జతగా 2MP సెన్సార్ మరియు AI లెన్స్ కూడా ఉన్నాయి. ఇక ఆన్‌బోర్డ్ విషయానికి వస్తే, Android 11 ఆధారిత HiOS 8 తో వస్తుంది మరియు మీరు ఈ ఫోన్‌లో 11 5G బ్యాండ్ సపోర్ట్ అందుకుంటారు. Tecno Pova 5G స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000mAh బిగ్ బ్యాటరీని కలిగివుంది. అలాగే, DTS-సపోర్టెడ్ స్పీకర్లు, Z-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ వంటి ఇతర ఫీచర్లను కూడా ఫోన్ లో ఇముడ్చుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :