Tecno Pop 9 ని కేవలం 6 వేల బడ్జెట్ లో గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!

HIGHLIGHTS

Tecno Pop 9 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు ఆకట్టుకునే ధరలో విడుదల చేసింది

ఈ ఫోన్ ను బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని తీసుకోచ్చింది

Tecno Pop 9 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు ఆకట్టుకునే ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని తీసుకోచ్చింది మరియు ఈ ఫోన్ ఫీచర్స్ కూడా అదే విధంగా అందించింది. ఇటీవల తీసుకు వచ్చిన పాప్ 9 5G యొక్క 4G వ్ వెర్షన్ గా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. టెక్నో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ పై లుక్కేద్దాం పదండి.

Tecno Pop 9 : పరిచే

టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,699 ధరతో లాంచ్ చేసింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై రూ. 200 తగ్గింపు ఆఫర్ ను కూడా అందించింది. నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.

Also Read: టెక్ విడ్డూరం: షోరూమ్ లో ఉన్న 12 పెద్ద రోబోట్ లను కిడ్నాప్ చేసిన చిన్న రోబోట్.!

Tecno Pop 9 : ఫీచర్స్

టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ చిప్ సెట్ Helio G50 తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. దీనికి జతగా 6GB వరకు ర్యామ్ ఫీచర్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందించింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన పెద్ద స్క్రీన్ ను కలిగి ఉంటుంది.

ఈ టెక్నో కొత్త ఫోన్ లో వెనుక 13MP AI డ్యూయల్ రియార్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. పాప్ 9 4జి స్మార్ట్ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెపెళ్లేంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :