Curved AMOLED డిస్ప్లే వంటి భారీ ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చిన టెక్నో స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

కర్వ్డ్ డిస్ప్లేతో Tecno Phantom X విడుదల

డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన టేకు కొత్త ఫోన్

ఈ ఫోన్ తో బ్లూటూత్ స్పీకర్‌ను ఉచితంగా అఫర్ చేస్తోంది

Tecno ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Tecno Phantom X ని విడుదల చేసింది. టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్లతో తీసుకువచ్చింది. ఈ ఫోన్ లో ప్రీమియం కర్వ్డ్ AMOLED డిస్ప్లే, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరా మరియు 5GB వరకూ వర్చువల్ RAM వంటి మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్లను టెక్నో అందించింది. మరి ఈ లేటెస్ట్ టెక్నో స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి చూద్దామా.

Tecno Phantom X: ప్రైస్

టెక్నో ఫాంటమ్ స్మార్ట్ ఫోన్ ను రూ.25,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ బ్లూటూత్ స్పీకర్‌ను మరియు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను ఉచితంగా అఫర్ చేస్తోంది.

Tecno Phantom X: స్పెక్స్

టెక్నో ఫాంటమ్ X స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ Curved AMOLED డిస్ప్లేని 90 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే కొంచెం పెద్దదైన పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ కటౌట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G95 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB LPDDR4X RAM మరియు 256GB UFS 2.1 స్టోరేజ్‌ ని కలిగివుంది. అంతేకాదు, ఈ ఫోన్ 5GB వర్చువల్ ర్యామ్ తో కూడా వస్తుంది మరియు ఈ ఫీచర్ తో ర్యామ్ 13GB వరకూ వర్చువల్ ర్యామ్ గా విస్తరిస్తుంది. దీనికోసం ఇంటర్నల్ స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 13MP పోర్ట్రైట్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందుభాగంలో, 48MP + 8MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 33W అడాప్టర్‌తో కూడిన 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, USB-C 2.0 సాకెట్, WiFi ac, బ్లూటూత్ 5.0 మరియు 3.5mm ఆడియో జాక్‌ని కూడా పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :