10 వేల కంటే తక్కువ ధరకే 11GB ర్యామ్ ఫోన్ తెస్తున్న టెక్నో..!!

Updated on 15-Jul-2022
HIGHLIGHTS

టెక్నో తన అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ టీజర్ విడుదల చేసింది

10 వేల కంటే తక్కువ ధరకే 11GB వరకూ ఉండేలా వర్చువల్ ర్యామ్ తో తీసుకువస్తునట్లు టెక్నో ప్రకటించింది

Tecno Spark 9 పేరుతొ తీసుకువస్తున్న టెక్నో

టెక్నో తన అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ టీజర్ విడుదల చేసింది. Tecno Spark 9 పేరుతొ తీసుకువస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు అంచనా ధరలను కూడా కంపెనీ వెల్లడించడం విశేషం. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కేవలం 10 వేల కంటే తక్కువ ధరకే 11GB వరకూ ఉండేలా వర్చువల్ ర్యామ్ తో తీసుకువస్తునట్లు టెక్నో ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB వరకూ స్టోరేజ్ ను కూడా ఆఫర్ల చేయనున్నట్లు పేర్కొంది. ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుసుకోవాల్సిన విషయాలు ఇవే.

Tecno Spark 9 ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు టెక్నో ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ లో అందించిన కొన్ని కీలకమైన స్పెక్స్ మరియి ఫీచర్లను మాత్రం టీజింగ్ ద్వారా తెలిపింది. టెక్నో స్పార్క్ 9 కోసం అమెజాన్ ఇప్పటికే మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. కాబట్టి, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి వస్తుందని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క వెల్లడైన వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ 6.6-ఇంచ్ HD డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 5GB  టోటల్ 11GB ర్యామ్ వరకు కలిగి ఉంటుందని దీనికి జతగా 128GB స్టోరేజ్ కూడా జత చేయబడుతుందని కూడా ప్రకటించింది. Tecno Spark 9 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12OS తో లాంచ్ చేయబడుతుంది మరియు 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఇన్ఫినిటీ బ్లాక్ మరియు స్కై మిర్రర్ అనే రెండు అక్షర్షణీయమైన కలర్ అప్షన్లలో వస్తుంది.

ఇక ఈ ఫోన్ కెమెరాల పరంగా చూస్తే,  టెక్నో స్పార్క్ 9 లో డ్యూయల్ కెమెరా సెటప్ తో కనిపిస్తోంది. అక్కని ఈ ఫోన్ కెమెరాల గురించి కంపెనీ ఇంకా అధికారికముగా ప్రకటించ లేదు.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :