Phantom V Fold 2: 80 వేల బడ్జెట్ సూపర్ Fold ఫోన్ ను లాంచ్ చేసిన టెక్నో.!

Updated on 06-Dec-2024
HIGHLIGHTS

టెక్నో ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్ కు పరిచయం చేసింది

Phantom V Fold 2 5G ఫోల్డ్ ఫోన్ ను 80 వేల బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది

ఈ ఫోన్ లో మంచి ఆకర్షణీయమైన ఫీచర్స్ ను అందించింది

టెక్నో ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్ కు పరిచయం చేసింది. అదే, Phantom V Fold 2 5G ఫోల్డ్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 80 వేల బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఫోల్డ్ ఫోన్ లావు ఇది బడ్జెట్ ఫోల్డ్ ఫామ్ గా వచ్చింది. అయితే, ఈ ఫోన్ లో మంచి ఆకర్షణీయమైన ఫీచర్స్ ను అందించింది. ఈరోజే సరికొత్తగా మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Tecno Phantom V Fold 2 : ప్రైస్

టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 ఫోన్ ను రూ. 79,999 (అన్ని ఆఫర్స్ తో కలిపి) రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేసింది మరియు అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Tecno Phantom V Fold 2 : ఫీచర్స్

టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జి ఫోల్డ్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు ఏరోస్పేస్ గ్రేడ్ హింజ్ డిజైన్ తో చాలా గట్టిగా ఉంటుందట. ఈ ఫోల్డ్ ఫోన్ లో 4 లక్షలకు పైగా ఫోల్డ్ లను తట్టుకుంటుందని కూడా టెక్నో తెలిపింది. ఈ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కలిగిన 7.85 ఇంచ్ ఫోల్డ్ స్క్రీన్ మరియు 6.42 ఇంచ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్ + 50MP (2x ఆప్టికల్ జూమ్) పోర్ట్రైట్ సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు షూట్ చేయవచ్చని టెక్నో తెలిపింది మరియు ఇందులో 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

Also Read: Instagram Down: తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్న యూజర్లు.!

ఈ ఫోన్ 12GB ఫిజికల్ ర్యామ్, 12GB ఎక్స్టెండెడ్ ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 70W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 5750 mah బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను AI ఫీచర్స్ మరియు ఫాంటమ్ వి పెన్ తో కూడా టెక్నో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :