ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ టెక్నో ఇండియాలో మొదటి మల్టీ కలర్ ఛేంజింగ్ స్మార్ట్ ఫోన్ TECNO CAMON 19 Pro Mondrian ను ఈరోజు ఇండియాలో ఆవిష్కరించింది. బ్యాక్ ప్యానల్లో వినూత్నమైన డిజైన్ తో పాటుగా అల్ట్రా క్లారిటీ కోసం ఇండస్ట్రీలో మొదటి RGBW+(G+P) లెన్స్‌తో 64MP OIS కెమెరాని కూడా ఈ ఫోన్ లో జత చేసింది. ఈ ఫోన్ కెమెరా సెటప్, డిస్ప్లే వివరాలు మరియు ఫోన్ లో అందించిన మరిన్ని ఫీచర్లు చూస్తే, ఈ ఫోన్ కచ్చితంగా ప్రీమియం ఫోన్ అనే అనుకుంటారు. కానీ, టెక్నో భారతీయ బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫోన్ ధరను ఊహించనంత తక్కువకే అఫర్ చేయడం విశేషం. టెక్నో యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివరాలు తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
TECNO CAMON 19 Pro Mondrian: ధర
టెక్నో క్యాంమాన్ 19 ప్రో మాండ్రియన్ ను కేవలం రూ.17,999 రూపాయల స్పెషల లాంచ్ ధరతో టెక్నో ప్రకటించింది.
టెక్నో క్యాంమాన్ 19 ప్రో మాండ్రియన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. అలాగే, వైడ్‌వైన్ L1 సర్టిఫికేషన్ మిమ్మల్ని గరిష్టంగా 1080P రిజల్యూషన్‌తో OTT కంటెంట్‌ని చూడటానికి అనుమతిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ Helio G96 SoC తో పనిచేస్తుంది. CAMON 19 ప్రో మాండ్రియన్ అల్ట్రా లార్జ్ 13GB RAM తో కొత్త స్పీడ్‌లను అందుకోవచ్చు. దీని 8GB LPDDR4x ర్యామ్ మరియు 5GB వరకు వర్చువల్ RAM తో ఈ బిగ్ డీల్ ను అమలు చేస్తుంది. ఇందులో 128GB UFS 2.2 అంతర్గత స్టోరేజ్ మరియు 512GB వరకు విస్తరించదగిన స్టోరేజ్ కూడా మీకు అందుతుంది.
కెమెరా పరంగా, అల్ట్రా క్లారిటీ కోసం ఇండస్ట్రీలో మొదటి RGBW+(G+P) లెన్స్‌తో 64MP OIS ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఈ సెటప్ లో 64MP+50MP+2MP ట్రిపుల్ కెమెరాతో ఉంటుంది. ఈ కెమెరాతో అద్భుతమైన ఫోటోలను చిత్రికరించవచ్చని టెక్నో చెబుతోంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 32MP HDR సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా, మాండ్రియన్ ఆర్ట్ స్ఫూర్తితో భారతదేశపు మొట్టమొదటి మల్టీ కలర్ ఛేంజింగ్ ఫోన్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ లో దీర్ఘ బ్యాకప్ కోసం 5000mAh హై కెపాసిటీ బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జర్ సపోర్ట్ తో అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile