ఇండియాలో విడుదలకానున్న నోకియా 9 ప్యూర్ వ్యూ

Updated on 20-Mar-2019
HIGHLIGHTS

HMD గ్లోబల దీని విడుదలకు సంభందించిన ఒక టీజింగ్ వీడియోని, నోకియా యొక్క అధికారిక పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

ఇటీవలి జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో HMD గ్లోబల్, నోకియా 1 ,నోకియా 3.2 మరియు నోకియా 4.2 ఫోన్లతో పాటుగా తన ఫ్లాష్ షిప్ కెమేరా బీస్ట్ అయినటువంటి, నోకియా 9 ప్యూర్ వ్యూ ని కూడా ప్రదర్శించింది. అయితే, నోకియా 9 ప్యూర్ వ్యూ ఒక 5 కెమేరాల సెట్ గా రావడం మరియు ఈ 5 కెమెరాలన్నీ కూడా ఒకేసారి పనిచేసేలా అందించిన పనితీరు అందరిని ఆకట్టుకుంది.

ఇక గురించి తెలుసుకున్న నోకియా అభిమానులు, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రానున్నదన్న విషయం పైనా నోకియా యొక్క సోషల్ ప్లాట్ఫారల పైన గొప్ప చర్చనీయాంశం అయ్యింది. నోకియా అభిమానులకి ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో విడుదలకానున్నదనే, తీపి కబురును అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం కెమేరాల పరంగా మాత్రమేకాకుండా QHD+ POLED డిస్ప్లేతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది.

నోకియా 9 ప్యూర్ వ్యూ, ఈ ఫోన్ ఇటీవల FCC ద్వారా ఆమోదించబడింది మరియు చైనాలో కూడా 3C బాడీ ఆమోదం పొందింది. ఈ ప్రధాన ఫోన్ HDR10 మద్దతుతో పాటు QHD+ రిజల్యూషన్ తో ఒక 5.99-అంగుళాల POLED డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్, హుడ్ కింద ఒక స్నాప్డ్రాగన్ 845 SoC తో ఉంటుంది. ఈ చిప్సెట్ 6GB RAM మరియు 128GB స్టోరేజి తో జత చేయబడుతుంది. 4GB RAM మరియు 128GB స్టోరేజితో పాటు ఒక సాధారణ వేరియంట్ కూడా ఉండవచ్చు.

నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ Android 9 Pie తో అమలవుతుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మద్దతునిచ్చే ఒక పెద్ద 3,320mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు IP67 ద్రువీకరణతో వస్తుంది కాబట్టి నీరు మరియు డస్ట్ ప్రూఫ్ కూడా ఇందులో ఉంటుంది.                                     

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :