ఇండియాలో విడుదలకానున్న నోకియా 9 ప్యూర్ వ్యూ
HMD గ్లోబల దీని విడుదలకు సంభందించిన ఒక టీజింగ్ వీడియోని, నోకియా యొక్క అధికారిక పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
ఇటీవలి జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో HMD గ్లోబల్, నోకియా 1 ,నోకియా 3.2 మరియు నోకియా 4.2 ఫోన్లతో పాటుగా తన ఫ్లాష్ షిప్ కెమేరా బీస్ట్ అయినటువంటి, నోకియా 9 ప్యూర్ వ్యూ ని కూడా ప్రదర్శించింది. అయితే, నోకియా 9 ప్యూర్ వ్యూ ఒక 5 కెమేరాల సెట్ గా రావడం మరియు ఈ 5 కెమెరాలన్నీ కూడా ఒకేసారి పనిచేసేలా అందించిన పనితీరు అందరిని ఆకట్టుకుంది.
Surveyఇక గురించి తెలుసుకున్న నోకియా అభిమానులు, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రానున్నదన్న విషయం పైనా నోకియా యొక్క సోషల్ ప్లాట్ఫారల పైన గొప్ప చర్చనీయాంశం అయ్యింది. నోకియా అభిమానులకి ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో విడుదలకానున్నదనే, తీపి కబురును అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం కెమేరాల పరంగా మాత్రమేకాకుండా QHD+ POLED డిస్ప్లేతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది.
నోకియా 9 ప్యూర్ వ్యూ, ఈ ఫోన్ ఇటీవల FCC ద్వారా ఆమోదించబడింది మరియు చైనాలో కూడా 3C బాడీ ఆమోదం పొందింది. ఈ ప్రధాన ఫోన్ HDR10 మద్దతుతో పాటు QHD+ రిజల్యూషన్ తో ఒక 5.99-అంగుళాల POLED డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్, హుడ్ కింద ఒక స్నాప్డ్రాగన్ 845 SoC తో ఉంటుంది. ఈ చిప్సెట్ 6GB RAM మరియు 128GB స్టోరేజి తో జత చేయబడుతుంది. 4GB RAM మరియు 128GB స్టోరేజితో పాటు ఒక సాధారణ వేరియంట్ కూడా ఉండవచ్చు.
నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ Android 9 Pie తో అమలవుతుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మద్దతునిచ్చే ఒక పెద్ద 3,320mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు IP67 ద్రువీకరణతో వస్తుంది కాబట్టి నీరు మరియు డస్ట్ ప్రూఫ్ కూడా ఇందులో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile