లీకైన స్నాప్ డ్రాగన్ 735 వివరాలు, 5G తో కూడిన 7nm ప్రాసెస్ తో రానుంది : రిపోర్ట్

Updated on 22-Apr-2019
HIGHLIGHTS

కొన్ని వారాల క్రితమే, స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసరును విడుదల చేసింది. అయితే, ఇప్పుడు స్పీడ్ మరియు 5G ప్రధానాంశంగా ఈ కొత్త స్నాప్ డ్రాగన్ 735 ప్రాసెసర్ కోసం ఆపనిచేస్తునట్లు ఇంటర్నెట్ లో చాల వార్తలు మరియు అంచనాలతో కూడైన నివేదికలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే గనుక నిజమైతే,  రానున్న ఈ ప్రాసెసర్ ప్రస్తుతం ఉన్నతమైన ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 855 ను కూడా వెనక్కినెట్టి ముందుకు సాగుతుంది.

ఈ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ కలిగినటువంటి 2+2+4 చిప్సెట్ నిర్మాణంలాగా కాకుండా, 1+1+6 నిర్మాణంతో రానున్నట్లు అంచనావేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 730  చిప్సెట్ నిర్మాణం కూడా మనకు 2+6 తో ఉంటుంది కాబట్టి ఇలా జరగడానికి అవకాశమునట్లు అంచనా వేస్తున్నారు. అలాగే, స్నాప్ డ్రాగన్ 735 ప్రాసెసరను ఒక 2.9GHz +ఒక 2.4GHz+ ఆరు 1.8GHz క్లాక్ స్పీడ్స్ తో ఉండవచ్చని ఊహిస్తున్నారు.

ఈ ప్రాసెసర్ AI సంబంధిత టాస్క్ ల కోసం 1GHz వరకు క్లాక్ చేయగల NPU220 మరియు 750MHz వరకు స్పీడ్ అందిచగల అడ్రినో 620GPU ని కలిగివుండొచ్చని  కూడా అంచనావేయబడింది.

అలాగే, కొత్తగా వచ్చిన లీక్స్ మరియు రూమర్ల ద్వారా ఈ ప్రాసెసర్ 5G సపోర్టుతో కూడా రానున్నట్లు వివరిస్తున్నాయి. అయితే, మనకు 5G వచ్చిన తరువాతనే 5G ఎలాగ పనిచేస్తున్నదన్న విషయం తనిఖీ చెయ్యడానికి వీలుంటుంది. అంతేకాదు, ఇది మిడ్ రేంజ్ ధరలో 5G టెక్నాలజీని అందుబాటులోకి తేనున్న చిప్సెట్ గా కూడా కొనియాడబడుతుంది. అయితే, దీని గురించిన పూర్తి సమాచారం వచ్చే వరకు వేచి చుడాల్సిందే.             

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :