samsung launching m16 and m06 in india
శామ్సంగ్ ఇండియాలో Samsung Galaxy M16 మరియు M06 ఫోన్ లను లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం శామ్సంగ్ టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. రీసెంట్ గా గెలాక్సీ F సిరీస్ నుంచి 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో F06 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన శామ్సంగ్ ఇప్పుడు మరో బడ్జెట్ సిరీస్ M సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల చేయడానికి సిద్ధమయ్యింది.
శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గెలాక్సీ M16 మరియు M06 స్మార్ట్ ఫోన్ లను ఎప్పుడు లాంచ్ చేస్తుందో ఇంకా ప్రకటించలేదు. Coming Soon ట్యాగ్ లైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి శామ్సంగ్ టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్స్ లాంచ్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజింగ్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. అంయితే, అమెజాన్ ఇండియా ఈ సిరీస్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది అని అర్థం అవుతోంది.
Also Read: Sony Bravia 3 Series స్మార్ట్ టీవీల పై అమెజాన్ బిగ్ డీల్స్.!
శామ్సంగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఎటువంటి ఇతర వివరాలు వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా గెలాక్సీ M06 ఫోన్ డ్యూయల్ కెమెరాతో మరియు శామ్సంగ్ గెలాక్సీ M16 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ కావచ్చని అనిపిస్తుంది.
అంతేకాదు, ఈ ఫోన్స్ లాంచ్ కోసం కంపెనీ అందించిన క్యాప్షన్ ను బట్టి ఈ రెండు ఫోన్లు కూడా ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి అనే అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ ఫోన్లకు ‘Can’t Beat The Master’ అనే ట్యాగ్ లైన్ అందించింది. అంటే, ఈ సెగ్మెంట్ లో మంచి ఫీచర్స్ కలిగిన గొప్ప పోటీదారు గా ఫోన్ లను అందించవచ్చని అంచనా వేస్తున్నారు.