Samsung Galaxy S25 Ultra launched with super ai features and powerful camera
Samsung Galaxy S25 Ultra స్మార్ట్ ఫోన్ ను ఈరోజు శామ్సంగ్ గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసింది. కాలిఫోర్నియాలో శామ్సంగ్ నిర్వహించిన లాంచ్ ఈవెంట్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్ లలో అత్యంత ప్రీమియం ఫోన్ గా ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ మరియు సూపర్ AI ఫీచర్స్ తో పాటు జబర్దస్త్ కెమెరాతో లాంచ్ చేసింది.
శామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేసింది. అలాగే, ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 1TB హెవీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ S25 అల్ట్రా ఫోన్ 6.9 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్, QHD+ రిజల్యూషన్ మరియు అడాప్టివ్ కలర్ టోన్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ఈ సిరీస్ యొక్క సిగ్నేచర్ క్వాడ్ కెమెరా సెటప్ ను అందించింది. ఇందులో 200MP వైడ్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో మరియు 10MP టెలిఫోటో ఉన్నాయి. ఈ ఫోన్ 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI సపోర్ట్ కలిగిన గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.
ఈ ప్రీమియం ఫోన్ ను లేటెస్ట్ One UI 7 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 15 OS తో అందించింది. ఈ ఫోన్ లో 5000 mAh 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ తో వస్తుంది. అయితే, ఛార్జర్ ను సపరేట్ గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వస్తుంది మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: Infinix Smart 9HD: స్ట్రాంగ్ బిల్డ్ మరియు కొత్త డిజైన్ తో వస్తోందని కంపెనీ టీజింగ్.!
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో $1299 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో శామ్సంగ్ ప్రకటించింది. ఈ రెండు వేరియంట్ ధరలు ఇక్కడ చూడవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (12GB + 521GB) ధర : రూ. 1,29,999
శామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (12GB + 1TB) ధర : రూ. 1,65,999
ఈ ఫోన్ Pre-Book ఈ రోజు నుంచి మొదలయ్యింది. ఈ ఫోన్ ను అమెజాన్ మరియు samsung అధికారిక వెబ్సైట్ ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.