Samsung Galaxy S25+ launched with fast wireless charge and AI support
Samsung Galaxy S25+: శామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ నుంచి ఈరోజు మూడు ఫోన్లు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద స్క్రీన్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదల చేసింది. ఈ రోజే సరికొత్తగా విడుదలైన ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ప్రతి వివరాలు తెలుసుకోండి.
శామ్సంగ్ గెలాక్సీ S25+ 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ కలర్ టోన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది మరియు దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ర్యామ్ స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో కూడా శామ్సంగ్ గెలాక్సీ S25 లో కలిగిన అదే కెమెరా ఉంటుంది. ఇందులో 12MP అల్ట్రా వైడ్, 50 MP వైడ్ మరియు 10MP టెలిఫోటో ట్రిపుల్ కెమెరా వుంది మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, స్టన్నింగ్ ఇమేజెస్ మరియు జూమ్ సపోర్ట్ తో వస్తుందని శామ్సంగ్ తెలిపింది.
ఈ శామ్సంగ్ గెలాక్సీ S25 ఫోన్ తో పోలిస్తే ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ మరియు మరింత వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4900 mAh బ్యాటరీ వుంది మరియు డిడ్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పైన శామ్సంగ్ లేటెస్ట్ One UI 7 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ కూడా IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
శామ్సంగ్ ఈ ఫోన్ ను US మార్కెట్ లో $999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ప్రైస్ ను బేసిక్ వేరియంట్ (12GB + 256GB) వేరియంట్ కోసం నిర్ణయించింది.