Samsung Galaxy S24 FE 5G got big discount on flipkart buy buy sale 2025
Samsung Galaxy S24 FE 5G స్మార్ట్ ఫోన్ పై రోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ గొప్ప కెమెరా మరియు గొప్ప విజువల్స్ అందించే ప్రో విజువల్ ఇంజన్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బై బై సేల్ 2025 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డీల్ అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 FE స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 59,999 బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 46% భారీ డిస్కౌంట్ తో రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart SBI క్రెడిట్ కార్డు మరియు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 30,499 రూపాయల ఆఫర్ ధరలో మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది.
Also Read: BSNL త్వరలో క్లోజ్ చేయబోతున్న ఈ బడ్జెట్ సూపర్ ప్లాన్ గురించి మీకు తెలుసా.!
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ మరియు ఇందులో గొప్ప విజువల్స్ అందించడానికి ప్రత్యేకమైన ప్రో విజువల్స్ ఇంజన్ కూడా అందించింది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Exynos 2400e చిప్ సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రాఫైట్ మరియు మింట్ మూడు రంగుల్లో లభిస్తుంది.
ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 50MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP (3x ఆప్టికల్ జూమ్) కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 10MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 30 FPS వద్ద UHD 8K (7680 x 4320) రిజల్యూషన్ వీడియో సపోర్ట్, 10x డిజిటల్ జూమ్ మరియు ఎఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4700 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.