Samsung Galaxy S22 5G available at half price from amazon gift sale
Samsung Galaxy S22 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 2024 దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకు వచ్చిన ఈ సేల్ నుంచి ఈ భారీ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. ఎంత గొప్ప ఆఫర్ అంటే, స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే పొందవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ S22 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ భారత మార్కెట్లో రూ. 72,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ. 38,200 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 34,799 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ శామ్సంగ్ ప్రీమియం ఫోన్ ను HDFC, HSBC మరియు BOBCARD కార్డ్స్ ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో గెలాక్సీ S22 ఫోన్ ను కేవలం రూ. 33,299 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. Buy From Here
Also Read: గొప్ప డిస్కౌంట్ తో 5 వేల ఆఫర్ ధరకే PHILIPS పవర్ ఫుల్ Soundbar అందుకోండి.!
శామ్సంగ్ గెలాక్సీ S22 5G స్మార్ట్ ఫోన్ ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ చాలా పటిష్టమైన డిజైన్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో విజన్ బూస్టర్ కలిగిన 6.1 ఇంచ్ 120Hz Dynamic AMOLED 2X స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఈ శామ్సంగ్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 1 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ ఫోన్ లో ప్రీమియం కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో వెనుక 12MP + 50MP + 10MP ట్రిపుల్ రియర్ మరియు 10MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరాతో తక్కువ వెలుగులో కూడా గొప్ప ఫోటోలు మరియు 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.