శామ్సంగ్ గెలాక్సీ S10 5G ఏప్రిల్ 5 న అమ్మకాలకు సిద్ధం

Updated on 22-Mar-2019
HIGHLIGHTS

ఎటువంటి ముందస్తు బుకింగులు లేకుండా సేల్ కానున్న 5G వేరియంట్.

ఇటీవల, శామ్సంగ్ దాని ప్రజాదరణ పొందిన గెలాక్సీ S సిరీస్ లైనప్ కింద మూడు కొత్త ప్రధాన స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది అవి – గెలాక్సీ S10, గెలాక్సీ S10e, మరియు గాలక్సీ S10 +. వీటిలో, శామ్సంగ్ గెలాక్సీ S10 + చాలా ప్రీమియం వేరియంట్ మరియు ఇవి ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక , అందరూ ఎదురుచూస్తూన్నటువంటి  5G వేరియంట్ అయినటువంటి, గెలాక్సీ S10 5G ని కూడా ఇప్పుడు మార్కెట్లోకి సేల్ కోసం అందుబాటులోకి తీసుకురానుంది.

అయితే, ఈ గెలాక్సీ S10 G తీసుకురానుంది, ఇండియాలో మాత్రంకాదు. ఈ 5G వేరియంట్ ని సౌత్ కొరియాలో ఏప్రిల్ 5 వ తేదీన మొదటి సరిగా సేల్ చేయనుంది.  ముందుగా US లోని వేరిజన్ ఈ స్మార్ట్ ఫోన్ 5G స్పీడుతో అత్యంత వేగవంతమైన డౌన్లోడ్ స్పీడ్ చూపించినట్లు లాంచింగ్ సమయంలో చూపించింది. అయితే, ఇప్పుడు సౌత్ కొరియాలో ఈ ఫోన్ అమ్మకానికి రానుంది కాబట్టి అక్కడ ఈ ఫోన్ యొక్క స్పీడ్ నమోదు చేస్తుందో చూడాలి.

ముందుగా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఈ 5G వేరియంట్ 4K రిజల్యూషనుతో వీడియో కాలింగ్ చేయడానికి సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇండియాలో 5G నెట్వర్క్ ఇంకా అందుబాటులో లేదు కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన కూడా 5G నెట్వర్కు పైన పనిచేయదు. కాబట్టి సరైన స్పీడ్ ఈ ఫోన్ ద్వారా అందుకునే అవకాశం మనకు ఉండదు.               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :