రూ.2,500 రుపాయల భారీ అఫర్ తో శామ్సంగ్ గెలాక్సీ M53 5G ఫస్ట్ సేల్.. ఎప్పుడంటే..!!

HIGHLIGHTS

గెలాక్సీ M53 5G భారీ అఫర్ తో మొదటిసారిగా అమ్మకానికి రానుంది

రూ.2,500 రూపాయల భారీ బ్యాంక్ అఫర్ శామ్సంగ్ అందించింది

Samsung Galaxy M53 5G 108 MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది

శామ్సంగ్ లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M53 5G భారీ అఫర్ తో మొదటిసారిగా అమ్మకానికి రానుంది. ఏప్రిల్ 29 న మొదటిసారిగా అమ్మకానికి వస్తున్నఈ స్మార్ట్ ఫోన్ పైన రూ.2,500 రూపాయల భారీ బ్యాంక్ అఫర్ శామ్సంగ్ అందించింది. ఈ Samsung Galaxy M53 5G వేగవంతమైన 5G ప్రాసెసర్, 108 MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు సేల్ ఆఫర్లను గురించి క్రింద చూడవచ్చు.

Samsung Galaxy M53 5G: ధర మరియు ఆఫర్లు

Samsung Galaxy M53 5G యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.23,999 మరియు మరొక వేరియంట్  8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.25,999. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 29 న ప్రారంభమవుతుంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, క్రెడిట్ కార్డ్స్ మరియు EMI లావాదేవీలపై రూ.2500 తక్షణ తగ్గింపుతో ICICI బ్యాంక్ సమ్మర్ బొనాంజా ఆఫర్ దీనిపైన అందించింది.            

Samsung Galaxy M53 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ M53 5G స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-0 కటౌట్ కలిగిన 6.7- ఇంచ్ Super AMOELD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది.

ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-0 కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 108MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. అలాగే, 2 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ లను కూడా ఈ ఫోన్ ద్వారా పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :