అమెజాన్ సేల్ నుండి Samsung Galaxy M52 5G పైన భారీ డీల్స్

Updated on 30-Sep-2021
HIGHLIGHTS

అమెజాన్ సేల్ నుండి గెలాక్సీ M52 5G పైన భారీ డీల్స్

అక్టోబర్ 3 నుండి అందుబాటులోకి

రెండు రోజుల క్రితం Samsung విడుదల చేసిన గెలాక్సీ M52 5G స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుండి భారీ డీల్స్ అందించింది. లేటెస్ట్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 3 వతేది నుండి అందుబాటులోకి వస్తుంది మరియు ఇంట్ర డక్టరీ అఫర్, కూపన్ అఫర్ మరియు బ్యాంక్ అఫర్ తో పాటుగా మరిన్ని లాభాలను ఈ ఫోన్ కొనుగోలుదారుల కోసం అఫర్ చేస్తోంది.

Samsung Galaxy M52 5G: Price&Offers

గెలాక్సీ M52 5G స్మార్ట్ ఫోన్ రూ.29,999 రూపాయల ప్రారంభ ధరలో వచ్చింది. ఈ ఫోన్ అమెజాన్, samsung ఆన్లైన్ స్టోర్ మరియు అన్ని ప్రముఖ రిటైల్ షాపుల నుండి లభిస్తుంది. అయితే, అక్టోబర్ 3 వతేది నుండి మొదలవనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి స్పెషల్ ఇంట్రడక్టరి సేల్ అఫర్ క్రింద కేవలం రూ.26,999 ప్రారంభ ధరలో మరియు మరిన్ని భారీ ఆఫర్లతో లభిస్తుంది. ఇక కూపన్స్ ద్వారా అందించే 1,000 రూపాయల అమౌంట్ ను కూడా తగ్గిస్తే కేవలం రూ.25,999 ధరకే పొందవచ్చు. అధనంగా, HDFC కస్టమర్లకు 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.        

Samsung Galaxy M52 5G: స్పెసిఫికేషన్‌లు

ఈ శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ 6.7 ఇంచ్ FHD+ ఇన్ఫినిటీ 0 డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన SuperAMOLED డిస్ప్లే. ఈ ఫోన్‌ను అన్నివిధాలా వేగంగా ఉంచడానికి మంచి ప్రోసెసర్ అందించింది. అంటే,  స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి Snapdragon 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఈ ఫోన్ అందించింది.

ఈ ప్రొసెసర్ 6nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు 11 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది. గెలాక్సీ M52 5G 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జి స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో వచ్చింది మరియు వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 12ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా మరియు 5ఎంపి మ్యాక్రో కెమెరా లను అందించింది. ఇక ముందుభాగంలో, భారీ 32 ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :