Samsung Galaxy M33 5G: ఆకర్షణీయమైన ధరలో మంచి ఫీచర్లతో వచ్చిన శామ్సంగ్ కొత్త ఫోన్..!!

HIGHLIGHTS

శామ్సంగ్ ఈరోజు Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది

ఈ సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది

ఈ ఫోన్ పైన ఇంట్రడక్టరి మరియు భారీ బ్యాంక్ ఆఫర్లను కూడా శామ్సంగ్ ప్రకటించింది

శామ్సంగ్ ఈరోజు ఇండియాలో Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. శామ్సంగ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన ధరలో మంచి ఫీచర్లతో వచ్చింది. గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీ, వేగవంతమైన 5nm ప్రోసెసర్ మరియు 16GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ వంటి భారీ ప్రత్యేకతలతో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఇంట్రడక్టరి మరియు భారీ బ్యాంక్ ఆఫర్లను కూడా శామ్సంగ్ ప్రకటించింది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ 5G స్మార్ట్ ఫోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకుందామా.      

Samsung Galaxy M33 5G: ధర మరియు ఆఫర్లు

శామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.18,999 మరియు 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,499. అయితే, ఇంట్రడక్టరి అఫర్ క్రింద 6GB ర్యామ్ వేరియంట్ ను రూ.17,999 మరియు 8GB ర్యామ్ వేరియంట్ ను రూ.19,999 రూపాయల ధరకే అఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.

అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డుల ద్వారా కొనేవారికి 2,000 రూపాయల తక్షణ క్యాష్ బ్యాక్ ను కూడా జతచేసింది. శామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జి ఏప్రిల్ 8 నుండి అమెజాన్ మరియు Samsung  ఆన్లైన్ స్టోర్ నుండి లభిస్తుంది.

Samsung Galaxy M33 5G:స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి శామ్సంగ్ రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-V కటౌట్ కలిగిన 6.6- ఇంచ్ TFT డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ పూర్తి డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో జత చేసింది. ఈ M33 ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత 5G మరియు 5nm ప్రోసెసర్ Exynos 1280 కి జతగా 6/8GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ర్యామ్ కు సమానమైన వర్చువల్ ర్యామ్ ను కూడా ఇందులో అందించడం విశేషం.

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జర్ ను మాత్రం అందించడం లేదని కంపెనీ తెలిపింది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇలా చేయవలసి వచ్చినట్లు శామ్సంగ్ స్పష్టం చేసింది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-V కటౌట్ లో అందించింది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగివుంది. ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ రెండు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :