Samsung Galaxy M33 5G: 16GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది..!!

HIGHLIGHTS

Galaxy M33 5G లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

శామ్సంగ్ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Galaxy M33 5G

16GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్

శామ్సంగ్ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Galaxy M33 5G లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తునట్లు ప్రకటించింది. శామ్సంగ్ బడ్జెట్ సిరీస్ గా పేరొందిన M సిరీస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకువస్తోంది. అయితే, ఇప్పటికే అందించిన టీజర్ మరియు అమెజాన్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా చేస్తున్న టీజింగ్ ద్వారా, ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను వెల్లడించింది.  ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీ, వేగవంతమైన 5nm ప్రోసెసర్ మరియు 16GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ వంటి భారీ ప్రత్యేకతలతో వస్తున్నట్లు తెలిపింది.

Samsung Galaxy M33 5G: రివీల్డ్ మరియు అంచనా స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి శామ్సంగ్ రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ ను ఇన్ఫినిటీ-V కటౌట్ కలిగిన 6.6- ఇంచ్ TFT LCD ప్యానల్ తీసుకువస్తోంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగివుంటుంది. ఈ పూర్తి డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో జత చేసింది. ఈ M33 ఫోన్ ను 5nm ప్రోసెసర్ కి జతగా 6/8GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ర్యామ్ కు సమానమైన వర్చువల్ ర్యామ్ ను కూడా ఇందులో అందించడం విశేషం.

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జర్ ను మాత్రం అందించడం లేదని కంపెనీ తెలిపింది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇలా చేయవలసి వచ్చినట్లు శామ్సంగ్ స్పష్టం చేసింది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-V కటౌట్ లో దాచుకుంది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన  మాడ్యూల్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ రెండు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :