Samsung ఈరోజు గెలాక్సీ M సిరీస్ నుండి శాంసంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 720G ప్రోసెసర్, 48ఎంపి క్వాడ్ కెమెరా మరియు 5000mAh బ్యాటరీ వంటి బెస్ట్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. అధనంగా, ఈ శాంసంగ్ 5G స్మార్ట్ ఫోన్ 12 5G బ్యాండ్స్ కి మద్దతు ఇస్తుంది. ఈ లేటెస్ట్ 5G ఫోన్ గురించి క్లిప్తంగా ఈ క్రింద చూడవచ్చు.
గెలాక్సీ M32 5G బేసిక్ వేరియంట్ 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ వేరియంట్ రూ.20,999 రూపాయల ప్రారంభ ధరలో వచ్చింది. 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ వేరియంట్ రూ.22,999 రూపాయల ధరలో వచ్చింది. సెప్టెంబర్ 2 వతేది మధ్యాహ్నం 12 గంటలకు శాంసంగ్ అధికారిక వెబ్సైట్ మరియు అమెజాన్ నుండి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభమవుతుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 6.5 అంగుళాల HD+ ఇన్ఫినిటీ V డిస్ప్లేని 60Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌లో స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ను ఉపయోగించినట్లు శాంసంగ్ తెలిపింది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.2 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 GPU తో జతగా ఉంటుంది మరియు 7nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 12 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది మరియు సంవత్సరాల వరకూ OS సపోర్ట్ తో వస్తుందని కూడా శాంసంగ్ వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 48ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 13ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.
గెలాక్సీ M32 5G 5000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది. అయితే, ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను పవర్ బటన్‌తో క్లబ్ చేసి సైడ్‌లో ఇచ్చింది.