Samsung Galaxy M16 5G స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ మరియు కొత్త డిజైన్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 27-Feb-2025
HIGHLIGHTS

Samsung Galaxy M16 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది

సరికొత్త డిజైన్ మరియు పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్ తో అందించింది

ఈ ఫోన్ ను గ్లాసీ ఫినిష్ బ్యాక్ మరియు స్లీక్ డిజైన్ తో అందించింది

Samsung Galaxy M16 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్ తో అందించింది. గెలాక్సీ M సిరీస్ నుంచి ఇప్పటికే చాలా ఫోన్లను బడ్జెట్ ధరలో విడుదల చేసిన శామ్సంగ్ ఈ ఫోన్ ను కూడా అదే వ్యూహంతో మార్కెట్ లో ప్రవేశపెట్టింది. అయితే, డిజైన్ పరంగా మంచి మార్పులు చేసింది.

Samsung Galaxy M16 5G: ప్రైస్

శామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 11,999 రూపాయల ప్రారంభ మరియు ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 4GB + 128GB వేరియంట్ ను ఈ ధరతో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పై మంచి ఆఫర్లు కూడా శామ్సంగ్ అందించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, samsung.com మరియు సెలెక్టెడ్ రిటైల్ స్టోర్ లావు కూడా లభిస్తుంది.

Samsung Galaxy M16 5G: ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ 5G చిప్ సెట్ Dimensity 6300 తో అందించింది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ ను గ్లాసీ ఫినిష్ బ్యాక్ మరియు స్లీక్ డిజైన్ తో అందించింది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో 50MP మెయిన్, 5MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

Also Read: 200W Dolby Soundbar ని భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలోనే అందుకోండి.!

శామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్ 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 6 మేజర్ OS అప్గ్రేడ్ లను అందుకుంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ ను మూడు కలర్ ఆప్షన్ లలో అందించింది. ఇందులో థండర్ బ్లాక్, మింట్ గ్రీన్ మరియు బ్లష్ పింక్ కలర్స్ ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :