Samsung Galaxy F70e 5G: న్యూ లుక్ అండ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

శాంసంగ్ గెలాక్సీ F సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు కంపెనీ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను న్యూ లుక్ అండ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కొత్త టీజర్ వీడియో ద్వారా వెల్లడించింది

Samsung Galaxy F70e 5G స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా

Samsung Galaxy F70e 5G: శాంసంగ్ గెలాక్సీ F సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఈరోజు కంపెనీ అనౌన్స్ చేసింది. అదే, శాంసంగ్ గెలాక్సీ F70e స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను న్యూ లుక్ అండ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కొత్త టీజర్ వీడియో ద్వారా వెల్లడించింది. మరి ఈ అప్ కమింగ్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.

Samsung Galaxy F70e 5G: లాంచ్ డేట్?

శాంసంగ్ గెలాక్సీ F70e స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 9వ తేదీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు శాంసంగ్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లో డిజైన్ మరియు మరిన్ని ఇతర వివరాలు తెలియజేసే టీజర్ వీడియో కూడా విడుదల చేసింది.

Samsung Galaxy F70e 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ F70e స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ లో అందిస్తున్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక లెథర్ బ్యాక్ ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అయితే, ఇది ఒరిజినల్ లెథర్ అవుతుందా లేదా లెథర్ టెక్స్చర్ మాత్రమే కానున్నదో అని తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నట్లు మనం చూడవచ్చు మరియు చాలా సింపుల్ డిజైన్ లో కూడా ఉంటుంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు జతగా ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఈ వివరాలు ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా కంపెనీ కన్ఫర్మ్ చేసిన వివరాలు.

శాంసంగ్ గెలాక్సీ F70e : అంచనా స్పెక్స్

ఇప్పటి వరకు మనం కేవలం ఈ ఫోన్ గురించి కంపెనీ వెల్లడించిన వివరాలు మాత్రమే చూశాము. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ చూద్దాం. ఎందుకంటే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లీక్స్ ప్రకారం, ఈ అప్ కమింగ్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ ఫోన్ One UI 8 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుందని అంచనా వేసి చెబుతున్నారు. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు.

Also Read: ChatGPT Down: ప్రముఖ AI చాట్‌బాట్ సర్వీస్ లో అంతరాయం.. యూజర్ల నిట్టూర్పు.!

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుందట. ఇది మంచి వీడియోలు మరియు ఇమేజస్ కోసం తగిన కెమెరాగా ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ గురించి లీక్స్ చెబుతున్న మాటలో నిజం ఎంత ఉందో వచ్చే వారం తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :